అమెజాన్ ఆన్లైన్ దిగ్గజం. అమెజాన్ లో దొరకని వస్తువు అంటూ ఉండదు.  పుస్తకాలు అమ్మే పోర్టల్ నుంచి ప్రపంచంలో ప్రతి వస్తువును అమ్మే ఆన్లైన్ పోర్టల్ గా పేరు తెచ్చుకుంది.  వేల కోట్ల టర్నోవర్ కలిగిన అమెజాన్ కొత్త బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నది.  అన్ని రకాల బిజినెస్ లోకి అడుగుపెట్టిన అమెజాన్ ఫుడ్ బిజినెస్ లో మాత్రం వెనుకబడింది.  మాములుగా ఏదైనా ఒక ఆర్డర్ బుక్ చేస్తే అమెజాన్ నుంచి రావడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది. 


అదే ఫుడ్ బిజినెస్ లోకి దిగితే నిమిషాల వ్యవధిలో ఆర్డర్స్ సప్లై చేయాల్సి వస్తుంది.  దీనికి బోలెడంత స్టాఫ్ అవసరం ఉంటుంది.  ఫుడ్ బిజినెస్ పోర్టల్ ద్వారా కంటే యాప్ ద్వారానే ఎక్కువగా జరుగుతుంది.  ఈ రంగంలో ఇప్పటికే జొమాటో, స్విగ్గి, ఫుడ్ పాండాలు దూసుకుపోతున్నాయి.  జొమాటో, స్విగ్గిలకు ఫుల్ డిమాండ్ ఉన్నది.  ఈ రెండింటి వాటానే ఎక్కువ.  మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవడంతో ఈ రెండు సంస్థలు సక్సెస్ అయ్యాయి.  ప్రతి పట్టణంలో ఈ రెండు సంస్థలు విస్తరించాయి.  మరో ఏడాదిలో మరో 500 పట్టణాల్లో వీటిని విస్తరించాలని చూస్తున్నాయి.  


ఇలాంటి సమయంలో వీటికి పోటీగా అమెజాన్ ఫుడ్ బిజినెస్ రంగంలోకి దిగడం సాహసమనే చెప్పాలి.  ఉబెర్ ఈట్ వీటితో పోటీపడలేకపోతున్నది.  అమెజాన్ సంస్థ అమెరికాలో ఫుడ్ బిజినెస్ లోకి దిగినా ఫెయిల్ అయ్యింది.  అటు ఇంగ్లాండ్ లో స్టార్ట్ చేసి ఆపేసింది.  ఇప్పుడు ఇండియాలోకి రావాలని చూస్తోంది. 

కారణం మధ్యతరగతి ప్రజలు.  మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవడం కోసం అమెజాన్ కొత్తగా ఈ ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది.  మరి అమెజాన్ ఆశలు నెరవేరుతాయా.. అనుకున్నట్టుగానే ఈ రంగంలో విజయం సాధిస్తుందా చూద్దాం.  అమెజాన్ ఈ రంగంలోకి అడుగుపెడితే మరిన్ని సంచనాలు సృష్టించడం ఖాయం అని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: