భారత్ దాయాది దేశం పాకిస్థాన్ 370 ఆధికరణ రద్దు ను జీర్ణించుకోలేక పోతుంది.అందుకే ఇమ్రాన్ ఖాన్ అండ్ అతని టీమ్ సోషల్ మీడియా వేదికగా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. దివాలా తీసే దశలో ఉన్న తమ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయకుండా ఇమ్రాన్ ఖాన్ అండ్ టీమ్ భారత్ అంతర్భాగమైన కాశ్మీర్ పై తీసుకున్న నిర్ణయాన్ని తప్పు అంటూ దానిని అంతర్జాతీయ సమాజానికి తీసుకెళ్తానని బెదిరిస్తుంది.కాని దానిని భారత్ అసలు పట్టికోవట్లేదు.దానితో భారత్ దృష్టిని ఆకర్షించేందుకు ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రత కమిటీ సమావేశమైంది దానిలో భరత్ తో దౌత్య సంబంధాలు మరియు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపేయాలని అని కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.

అలాగే సోమవారం పాకిస్థాన్ నుండి భారత్ కు రావలసిన ఇద్దరు ఖైదీలను పాకిస్థాన్ తమ దేశంలోనే ఆపేసింది. షెడ్యుల్ ప్రకారం భారత్ కు రావాల్సిన ఖైదీలను ఇంకా ఎందుకు తమ దేశానికి పంపలేదో తమకు తెలపాలని భారత్, పాకిస్థాన్ ను కోరింది.అలాగే భారత్ కాశ్మీర్ వ్యవహారం పై అనుసరించిన తీరు సరికాదని దానిని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని పాక్ ప్రధాని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు.
ఎప్పటి నుండో భారత్, పాకిస్థాన్ ను అన్ని మార్గాలలో దూరం పెట్టిందని ఇన్నిరోజులు తమతో స్నేహం చేయమని అడిగిన భారత్ పట్టించుకోకపోవడంతో తమ ప్రజల ముందు ప్రచారం కోసం భారత్ దౌత్యని తగ్గిస్తాం అని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సత్య దూరమైన ప్రచారం చేస్తోందని అయిన పాక్ ను భారత్ ఎప్పుడో అంతర్జాతీయ సమాజం లో ఏకాకిని చేసిందని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా తమ నెక్స్ట్ టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని ప్రకటించాడు.దానితో వరుస షాక్ లు తింటున్న పాక్ ఇప్పుడేం చేయబోతోందో అని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: