తాజాగా ఆర్టికల్ 370 రద్దు అనే అంశం మీద తీవ్ర చర్చలు జరిపి చివరకి ఒక కీలక నిర్ణయాన్ని తెల్చేసింది మోదీ ప్రభుత్వం .జమ్మూకాశ్మీర్ ను రెండుగా విభజించి అంతర్జాతీయ దేశాల దృష్టిని ఆకర్షించింది భారత్. ఈ చర్యతో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం దొరికిందని దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా పాకిస్థాన్ కు మాత్రం కంటకింపుగా బాధాకరంగా మారింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


ఈ ఆపరేషన్ లో మరో కీలకమైన వ్యక్తి కూడా ఉన్నాడు. పాక్ పై గుక్క తిప్పుకోకుండా వ్యూహాలూ రచించి, జమ్మూకాశ్మీర్ విభజించిన ఘనత ఆయనకు కూడా దక్కుతుందా అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాల, ఆయన ఎవరనుకుంటున్నారా, ఆయనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఆర్టికల్ 370 రద్దులో దోవల్ కూడా కీలక పాత్రను పోషించారు. అత్యంత భారీ ఆపరేషన్ ను సఫలీకృతం చేసిన ఘనత ఆయనకు దక్కుతుందో లేదో కానీ జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి అదుపు తప్పకుండా ఆయన అంతటి గొప్ప వ్యూహాలు రచించారో అనే ఆలోచనలు వెల్లువెత్తుతున్నాయి.


జమ్మూకాశ్మీర్ ను రెండుగా విభజించిన విజయం చేసిన అజిత్ దోవల్ కు ఆ ప్రతిభ దక్కుతుంది. జమ్మూలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రాని కి వివరిస్తూ శాంతిభద్రతలూ అదుపు తప్పకుండా చేస్తూ ఆపరేషన్ ను వియజవంతం చేశారు. పార్లమెంటులో ఆమోదం పొందింది ఆర్టికల్ 370 రద్దు పని మొత్తం పూర్తయ్యాక నిన్న కాశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న షోపియాన్ లో పర్యటించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్థానికులతో కలిసి రోడ్డుపైనే భోజనం చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాశ్మీర్ విభజన ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కాశ్మీరీలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. భద్రతా దళాలతో కూడా సమావేశమయ్యారు.


ఆర్టికల్ రద్దు తో కాశ్మీరీల కోన గురై ప్రయోజనాల్ని వివరించారు. ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అమర్ నాథ్ యాత్రలో ఉద్రిక్తత మొదలు పార్లమెంటు ఉభయ సభల్లో ఆర్టికల్ 370 బిల్లు రద్దు వరకు పరిస్థితి చేయి దాటకుండా ఎప్పటికప్పుడు ఆరా తీశారు. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి ముందే గత నెల ఇరవై ఎనిమిదిన భద్రతా దళాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు దోవల్.



జమ్మూకాశ్మీర్ విభజన బిల్లే కాదు, రెండు వేల పదహారు సర్జికల్ స్ట్రైక్ సమయంలో భద్రతా దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అజిత్ దోవల్. పక్కా స్కెచ్ గీసి భారీ ఆపరేషన్ నిర్వహించారు దీంతో అప్పట్లో ఇండియన్ ఆర్మీతో పాటు  ఆపరేషన్ కు  నిర్దేశం చేసిన దోవల్ పై ప్రశంసలు కురిపించారు. సర్జికల్ స్ట్రైక్స్ ను నేరుగా వీక్షించిన ముగ్గురులో ఒకరు దోవల్ ప్రత్యేక డ్రోన్ల సాయంతో ఆపరేషన్ మొత్తాన్ని లైవ్ లో వీక్షించినట్లు అప్పట్లో ప్రచారం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: