నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేక సామాజిక,ఆర్ధిక,కారణాలకు తోడు, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆదివాసీలు అంతరించిపోతున్న తరుణంలో వారి సంరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి, ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని 1994లో ప్రకటించింది.

1997లో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు, హక్కులను కల్పిస్తూ.. ప్రపంచ దేశాల ప్రతినిధులను తీర్మానానికి ఆహ్వానించింది.

143 ఐరాస సభ్యుదేశాలు ఓటింగ్‌లో పాల్గొనగా 125 దేశాల ప్రతినిధులు తీర్మానాన్ని ఆమోదించారు. ఆనాటి నుంచి ఆదివాసీ హక్కులు, సంప్రదాయాల పరిరక్షణ, వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసుల జీవన స్థితిగతులు, హక్కులపై చైతన్యం పెంపొందించడమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా ఆదివాసీల గురించి కొన్ని వాస్తవాలు.

1, ప్రపంచ జనాభాలో 5 శాతం ఆదివాసీలు ఉన్నారు. 300 నుంచి 370 మిలియన్లు ఉన్న గిరిజన తెగలు 400 భాషలను ఉపయోగిస్తు న్నారు అని ఆదివాసీలపై ఐక్యరాజ్యసమితి శాశ్వత ఫోరం (యుఎన్‌పిఎఫ్‌ఐఐ) తెలియ జేసింది.

2, వ్యవసాయాభివ ద్ధి అంతర్జాతీయ నిధి (ఐఎఫ్‌ఎడి) సమాచారం ప్రకారం, 70 దేశాల్లో 5 వేల రకాల తెగల ఆదివాసీలు జీవిస్తున్నారు, వీరిలో 70 శాతం మంది ఆసియాలోనే ఉన్నారు

3, భారతీయ గిరిజనులు భారతదేశ సాంస్క  తిక వారసత్వం, జానపదాన్ని వందేళ్ళుగా ఎలాంటి స్క్రిప్ట్‌ లేకుండా పరిరక్షిస్తున్నారు, సంరక్షిస్తున్నారు.అందుకే ''ఆదివాసీలు సహజ వనరుల సంరక్షకులుగా, నిర్వాహకులుగా ఉన్నారు'' అని, చరిత్రకారులంటారు.

4, భారతదేశంలో వివిధ జాతులు, తెగల సమాహారమే 'ఆదివాసీ'లు. వారి మూలాల ఆధారంగా ఈ తెగలను ఆదివాసీలు, జాతులుగా పిలుస్తూ ఉంటారు. వనవాసి, జనజాతి, గిరిజనులు అని కూడా వారిని పిలుస్తారు.

5, భారత్‌లో ఆదివాసీల జనాభా ఆస్ట్రేలియా లో జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ.


గిరిపుత్రుల జీవన నేపథ్యం

ఆదివాసీల సామాజిక, ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా, విచారకరంగా ఉంది. దేశంలో వారు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అతి బీదలుగా పేదరికంలో మగ్గుతున్నా రు. వారికి సరైన భూమి,ఉపాధి లేదు. వారి జీవనానికి ఎలాంటి ఆదాయ మార్గం లేదు. కట్టుబానిసలైన కార్మికులుగా పనిచేస్తున్నారు. జీవనొపాధి కోసం కొన్ని కుటుంబాలు లిక్కర్‌ తయారీని ఎంచుకుంటు న్నారు. కొన్ని తెగలకు చెందిన కుటుంబాలు తమ సొంత పిల్లలనే విక్రయిస్తున్నారు. కొంత మంది మహిళలు 'కిరాయి' తల్లులుగా ఉంటు న్నారు.


పందులు, కుక్కలు వంటి జంతువుల మీద జరగాల్సిన వైద్యపరమైన కొత్త ఔషధ ప్రయోగాలకు అమాయక ఆదివాసీ తెగల కుటుంబాలు బలవుతున్నాయి. సహజ వనరులను ఆదివాసీ తెగలు సంరక్షిస్తుంటే, నాయకులు, మధ్య దళారులు బినామీ పేర్లతో వాటిని దోచుకుంటున్నారు.

ప్రతీ ఏటా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటూ, నాయకులు నాలుగు విషయాలు  మాట్లాడి ఏదేదో చేస్తామని వాగ్దానాలు చేస్తారు తప్ప ఆదివాసీల సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి.

ఎవరూ పట్టించుకోక పోవడం వల్ల అనేక సమస్యలు ఆదివాసీలను పీడిస్తున్నాయి. ఇంకా వారు తమ ఆరోగ్య సంరక్షణ కోసం అనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయ ఔషధ మొక్కల పైనే ఆధారపడు తున్నారు. ఆ ఔషధ మొక్కలను సంరక్షిస్తున్నారు. కానీ వారిని కాపాడే వారేరీ ?? 

మరింత సమాచారం తెలుసుకోండి: