నెహ్రు వల్లే భారత్ కు ఈ పరిస్థితా?
కేవలం జవహర్ లాల్ నెహ్రు చేసిన తప్పులు వల్లే దేశం ఈరోజున ఇంత దుస్థితిలో ఉంది అని బీజేపీ నాయకుల వాదన అలాగే రోజురోజుకు బీజేపీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం బలపడుతుంది,అయితే తమ పార్టీ మర్చిపోతారేమో అని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భయంతో వణికి పోయి దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకుడి మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. అయితే కేవలం నెహ్రు గారు చేసిన తప్పులను మనం ఇక్కడ తెలుసుకుందాం.


హైద్రాబాద్ ను భారత్ లో విలీనం చేయడానికి ముందు నిజాం నవాబ్ హైద్రాబాద్ ను పాకిస్థాన్ కు లొంగిపోవడానికి నిశ్చయించుకున్నాడు దానికి జవహర్ లాల్ నెహ్రు అంగీకారం కూడా తెలిపాడు కానీ అవన్నీ పక్కన పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ "పోలో" చేపట్టి హైద్రాబాద్ ను భారత్ లో విలీనం చేశారు,అలా మనకు హైదరాబాద్ దక్కింది, అది మొట్టమొదటి నెహు గారి తప్పుగా మేధావులు వాదిస్తున్నారు.అలాగే 1950లో ఐక్య రాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ను ఐక్యరాజ్య సమితి ఆహ్వానిస్తే ఆ సభ్యత్వాన్ని చైనా కి ఇప్పించాడు నెహ్రు గారు ఇది రెండో తప్పు అని వాదన.


కానీ అదే చైనా ఇప్పుడు మనకు మేకులా తయారు అయ్యింది,ఒకవేళ మనం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉంటే దేశం ఈరోజు అగ్ర రాజ్యాల సరసన ఉండేదని,అప్పుడు మనకి చైనా వల్ల ఏదైనా సమస్య వస్తే దాన్ని ఐక్యరాజ్య సమితి ద్వారా మనం పరిష్కరించుకునే వాళ్ళం.ఇది కేవలం నెహ్రు స్వలాభాలు కోసం చేసిన తప్పులని,కాంగ్రెస్ పార్టీ నాయకులు చరిత్రని ఒక్కసారి తెరిచి చూడాలని,నిజాలు తెలుసుకోవాలని మేధావుల సూచన.


మరింత సమాచారం తెలుసుకోండి: