పాపం మన బాబుగోరరికి ఈ మధ్య ఒకటే లక్ష్యం ఉంది. అదే   వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  దూకుడును ఎలాగైనా తగ్గించాలని.. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ లాంటి బలమైన నేతనే పడగొట్టిన బాబుకి జగన్ ను దెబ్బ కొట్టడం సాధ్యం కావట్లేదు అంటే అది ఖచ్చితంగా అతిశయోత్తే. అయితే మొత్తానికి  ఎలాగైనా జగన్ ను దెబ్బ కొట్టాలని  బాబుగోరు తన బుర్రకి పని చెబుతున్నారట. అసలుకే ఆ బుర్ర అపారమైన కుట్రలతో వెన్నుపోటులతో నిండి ఉన్న బుర్ర. మరి అలాంటి బుర్ర నుండి ఉపాయం వచ్చిందంటే.. ఖచ్చితంగా అది  అపాయకరమైనదే అయి ఉంటుంది. జగన్ కి కూడా ఈ విషయం తెలుసు. అందుకే బాబును జైలుకి పంపడమే బెటర్ అని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాడు.  ప్రస్తుతం జగన్,  బాబు జైలు ప్రణాళికాల్నే అమలు పరుస్తునట్లు కొందరి టీడీపీకి సంబంధించిన ప్రభుత్వ అధికారులు నుండి  లుకలుకలు విపిస్తున్నాయి. అయితే ఇప్పటికే  జగన్ కి అడ్డుకట్టవేసి, ఏదోవిధంగా జగన్ సర్కార్ మీద నింద మోపి  జనంలో సానుభూతి కొట్టేయాలని బాబుగోరు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తన పేస్ ను దీనంగా పెట్టి  తన ప్రాణాలకే ప్రమాదమనట్లు తన మీడియా చేత రాతలు రాపిస్తున్నారు. 


ఆ రాతలను బలం చెయ్యటానికి బాబు  ఆ మధ్య హైకోర్టుని కూడా  ఆశ్రయించారు. తన భద్రత విషయంలో జగన్ సర్కార్ అనుసరించిన వైఖరిని గురించి మొన్న కూడా ప్రెస్ మీట్ లో ఏకరవు పెట్టాడు బాబు. తనకు కేంద్రమే  భద్రత పెంచిందని కానీ జగన్ అనేవాడు మాత్రం దాన్ని తగ్గించాడని  ఇలా బాబు మొత్తానికి తన శైలి డైలాగ్ లతో  మీడియా ముందు చెప్పుకొని ఏడిస్తే బాగోదు అని.. మిక్కిలి చింతిస్తోన్నట్లు ఓ ఎక్స్ ప్రెషన్ కూడా పెట్టాడు. అయితే  జగన్ ను  మొదటి దెబ్బ కొట్టాలని  బాబుగోరు ఎప్పటి నుండో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.   అయితే, అవ్వన్నీ జగన్ ముందు పారావు అని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.    కానీ ఇక్కడ ఉంది ఎవరు..?  మన బాబుగోరు.  ఆయన బుర్ర ముందు ఇలాంటి ప్రమాణాలు, నిబంధనలు ఏవి పని చెయ్యవని గత ఇరవై ఏళ్ల నుండి నిరూపిస్తూనే ఉన్నాడు ఆయన. చివరికి ఎలాగైనా జగన్ ను  దెబ్బ కొడతాడు బాబు అనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏంటో బాబుగారు.        


మరింత సమాచారం తెలుసుకోండి: