మొన్నవరకు  చంద్రబాబుకి సెక్యూరిటీ ని తొలగించిన వివాదం ... నిన్నటి వరకు చంద్రబాబు ఇంటికి అనుమతి లేదు కూల్చేస్తాం అంటూ వివాదం .... ఇలా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారిన టీడీపీ , వైసీపీ మధ్య రాజకీయంలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చేసింది. అదే డ్రోన్ కెమెరాల గురుంచి.  డ్రోన్ కెమెరాల వల్ల వివాదం ఏంటి ... ఆ కెమెరాలతో బాగా నిఘా పెట్టొచ్చు అంటారా ... డ్రోన్ నిఘా   మంచిదే కానీ ... ఆ నిఘా కాస్త హై సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం , ప్రతిపక్ష నాయకుడి ఇంటి పై పెడితే  అది పెద్ద వివాదమే కదా. ఇప్పుడు అదే జరిగింది. 


హై సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటి పై డ్రోన్ కెమెరాలు తిరగటంతో... ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది.  కరకట్టపై ఉన్న చంద్ర బాబు ఇంటిపై జగన్ సర్కార్ డ్రోన్ కెమెరాలు పంపడంతో... చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగు తమ్ముళ్లు చంద్ర బాబు నివాసానికి చేరుకుని ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో పోలీస్ లు లాఠీ ఛార్జ్ చేయగా...పలువురు నేతలకి గాయలయ్యాయి.


చిలికి చిలికి గాలి వాన అయినట్టు ... బాబు జగన్ మధ్య ఏ ఇష్యు తెరమీదకి వచ్చిన అది పెద్ద వివాదంలా మారుతుంది .కాగా తన ఇంటి పై డ్రోన్ కెమెరాలు పంపించటం పై వైసిపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తూ ... జగన్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు బాబు.  తన సెక్యూరిటీ పై హై కోర్ట్ ఆదేశాలిచ్చిన ... వైసీపీ తన నీచపు రాజకీయాలను ఆపటం లేదని మండిపడ్డారు. మాజీ సీఎం ,ప్రతిపక్ష నాయకుడినైనా తన ఇంటి పై డ్రోన్ కెమెరాలు పంపించటానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.  సీఎం ఇంటి నుండి కిరణ్ అనే వ్యక్తి చెప్తే తన ఇంటి మీదకి డ్రోన్స్ పంపించారని పట్టుబడ్డ వాళ్ళు చెప్పారని  ...మరి సీఎం జగన్ ఇంటి పైకి కూడా ఇలాగె డ్రోన్స్ పంపుతారా అంటూ వైసీపీ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు .


అయితే ఈ వివాదం పై ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ యాదవ్ స్పందించారు. గతంలో కరకట్టపై ఉన్న ఇల్లు తనది కాదని చెప్పిన చంద్ర బాబు...ఇప్పుడు ఆ ఇల్లు నాదే అంటూ చంద్రబాబు ఎలా అంటున్నారని ప్రశ్నించారు. గత ఐదేండ్లలో వర్షాలు లేక చంద్ర బాబు ఇంట్లోకి నీళ్లు రాలేదని...ఇప్పుడు  ప్రకాశం బ్యారేజీకి అధికంగా నీరు వచ్చి  వరద వస్తే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని తాము ఎప్పుడో హెచ్చరించామన్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని ... ముంపు గ్రామాల ప్రజల రక్షణ దృష్ట్యా ...డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామన్నారు. ఈ విషయం పై అనవసర రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు ... ఇక నీ డ్రామాలు ఆపు అంటూ ఘాటుగా విమర్శించారు అనిల్ యాదవ్ .


మరింత సమాచారం తెలుసుకోండి: