జనసేన పార్టీలో పవన్ గురించి ఎప్పటి నుంచో ఒక ఫిర్యాదు ఉంది. పవన్ కళ్యాణ్ అందరీ సలహాలు తీసుకోడని, పార్టీలో ఒకరి ఇద్దరికీ మాత్రమే ఎక్కువ సమయం కేటాయిస్తాడని .. వారి సలహాలు మాత్రమే తీసుకుంటాడని పార్టీలోకి బలంగా వినిపిస్తున్న మాటలు.ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయిన మాజీ మంత్రి రావేలా కిషోర్ బాబు కూడా ఇలాగే తన అసంతృప్తిని బయట పెట్టారు. పవన్ నాకు ఎప్పుడు అందుబాటులో ఉండడని .. నేను చెప్పేది వినే ఓపిక కూడా ఉండేది కాదని మీడియా ముఖంగా చెప్పారు. అలాగే ఆ పార్టీలోని మరో నేత అడ్డంకి శ్రీధర్ కూడా ఇలాంటి ఫిర్యాదే చేశారు. బీజేపీ నుంచి జనసేనలో చేరిన అడ్డంకి శ్రీధర్ జనసేనలో తన సంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు. 


అయితే ఇలా నేతలు బయటికొచ్చి సోషల్ మీడియాలో పార్టీ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో జనసేన పార్టీ డామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్న ఆమధ్య కూడా జేడీ లక్ష్మి నారాయణ విషయంలో ఇలాంటి రూమరే ఒకటే వచ్చింది. కనీసం జేడీని కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదని వార్తలు వచ్చాయి.అయితే తరువాత అవన్నీ అబద్దాలేనని జేడీ ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చారు. అయితే ఆసంతృప్తి నేతలు కొంత మంది సోషల్ మీడియాలో తన భాదను చెబుతుండటంతో అలెర్ట్ అయిన పవన్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి.


అంతేగాని సోషల్ మీడియాలోకి వచ్చి రచ్చ చెయ్యొద్దని చెబుతున్నారు. నిజానికి సోషల్ మీడియాలో ఒక పార్టీని ఎంతలా బ్రష్టు పట్టించాలో  .. అంతలా బ్రష్టు పట్టించేయవచ్చు.ఏదైనా ఒక మీడియా సంస్థ ను అయితే మ్యానేజ్ చేయొచ్చు. కానీ సోషల్ మీడియా అలా కాదు గదా ! లక్షల మంది ఉంటారు. చెపాల్సిన విషయంలో కోట్ల మందికి చేరుతుంది. దీనితో పార్టీ ఇమేజీ దెబ్బ తింటుంది. ఇవన్నీ గమనించిన పవన్ ముందు జాగ్రత్తగా నేతలకు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: