నలభయ్యేళ్ళు అంటే మామూలు జీవితంలో  నడివయసు కింద లెక్క. అదే రాజకీయాల్లో చూసుకుంటే ఇంకా యూత్ కిందనే లెక్క. తెలుగు యువత అధ్యక్ష పదవులకు ఆ వయసులోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరిక్రిష్ణ నిర్వహించారు. ఇంకా రాజకీయాల్లోకి ప్రవేశించే వయసుగా నలభయ్యేళ్ళను పేర్కొంటారు. భారతదేశ రాజకీయాల్లో ప్రధాని,  ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవులు  అందుకునే సగటు   వయసు అంటే అది కచ్చితంగా షష్టి పూర్తి దాటిన వయసుగా ఉండాలి.


అటువంటి పరిస్థితుల్లో నలభయ్యేళ్ళ వయసులో రాజీవ్ గాంధి సువిశాల భారతదేశానికి ప్రధాని అయ్యారు. ఆయన ప్రధానమంత్రిగా 1984 అక్టోబర్ 31న బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజే ఆయన తల్లి, అప్పటికి ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధి  తన ఇంట్లోనే సెక్యూరిటీ వారి చేతుల్లో దారుణంగా హత్యకు గురి అయ్యారు. ఆపత్కాల పరిస్థితుల్లో గాంధీ వారసునిగా ఉన్న రాజీవ్ ని నాటి రాష్ట్రపతి జైల్ సింగ్ ప్రధానిని చేశారు.


అప్పటికి రాజీవ్ గాంధి కేవలం ఎంపీ మాత్రమే. అలా రాజీవ్ అనూహ్యంగా దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు.  తదనంతరం ఆయన పార్లమెంట్ ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే  తన తల్లి ఇందిరాగాంధి, తాత నెహ్రూల కంటే కూడా బంపర్ విక్టరీ లభించింది. 400 పైగా పార్లమెంట్ సీట్లను గెలిచి అజేయమైన శక్తిగా రాజీవ్ గాంధీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. నాడు ఇందిరాగాంధి దారుణ హత్య ప్రభంజనంగా వీచి కాంగ్రెస్ కి అన్ని సీట్లు తెచ్చిపెట్టింది. ఆ వూపులో బీజేపీ దిగ్గజం అటల్ బిహారీ వాజ్ పేయి వంటి వారెందరో ఓడిపోయారు.


ఇక రాజీవ్ అయిదేళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఆయన హయాంలోనే  టెలికమ్యూనికేషన్ వ్యవస్థ బాగా అభివ్రుధ్ధి చెందింది.  ఆధునిక సాంకేతికతను దేశంలోకి తెచ్చిన ఘనత కూడా రాజీవ్ దే. ఐతే బోఫొర్స్ కుంభకోణం ఆరోపణలతో రాజీవ్ గాంధీ సర్కార్ ఇబ్బందులో పడింది. కుడిభుజంగా ఉన్న నాటి ఆర్ధిక మంత్రి వీపీ సింగ్ రాజీనామా చేసి బయటకు రావడంతో ఆ వ్యతిరేకత బాగా పెరిగి 1989 డిసెంబర్లో  జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఓటమి పాలు అయింది.


తిరిగి ఏడాదిన్నరకు అంతే 1991 మే లో మధ్యంతర ఎన్నికలు జరుగుతూండగా ఎన్నికల ప్రచారానికి తమిళనాడు వచ్చిన రాజీవ్ గాంధీ శ్రీ పెరుంబుదూర్లో జరిగిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటికి ఆయన వయసు 47 ఏళ్ళు. చిన్న వయసులోనే ప్రధాని కావడం, అంతే వేగంగా జీవితం నుంచే నిష్క్రమించడం రాజీవ్ చరిత్ర చెబుతుంది. రాహుల్ గాంధీ 1944 ఆగస్ట్ 20న జన్మించారు. ఆయనది ప్రేమ వివాహం. సోనియా గాంధీని ఆయన పెళ్ళి చేసుకున్నారు. ఆయనకు కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధి ఉన్నారు. ఆయన దేశం కోసం ముఖ్యంగా యువత కోసం చేసిన కార్యక్రమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: