చంద్రబాబు నాయుడు లైఫ్ లో చాలా పెద్ద కల ఉన్నది.. అదే అమరావతి నిర్మాణం.  అమరావతిని ప్రపంచంలో ఐదు గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చి దిద్దాలని కలలు కన్నాడు.  దానికోసం భారీగా ప్లాన్ వేశారు.  అక్కడితో ఆగలేదు.. ప్రపంచ స్థాయి ప్లానర్స్ తో అమరావతి డిజైన్ చేయించారు.  ఎలా నిర్ణయాలు చేపడితే ఎలా ఉంటుంది అని నెలల తరబడి చర్చలు జరిపారు. సింగపూర్, జపాన్, బ్రిటన్ దేశాలకు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ లు డిజైన్లు పంపించారు.  


ఈ డిజైన్స్ కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలి అంటే కనీసం లక్ష కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అవసరం అవుతుంది.  ఆ స్థాయిలో బడ్జెట్ ను కేటాయించాలి అంటే మాములు విషయం కాదు.  అసలే రాష్ట్రం కొత్తగాఏర్పడింది.  కేంద్రంతో మొదట్లో బాగానే ఉన్నా ఆ తరువాత కేంద్రంతో విభేదాలు తెచ్చుకుంది. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందేమో అని భావించింది.  తీరా చూస్తే తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది.  దీంతో బాబు కలలు కన్న అమరావతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఆగిపోయింది.  


అయితే, బాబు అమరావతి లాజిక్ వెనుక చాలా అర్ధం ఉన్నది.  అమరావతి పేరు చాలా గొప్పపేరు.  ఈ పేరుమీద రాజధానిని ఏర్పాటు చేస్తే.. దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఒక గొప్ప రాజధానికి మారుతుంది.  అంతేకాదు, అమరావతిలో బౌద్ధుల ఆరామాలు ఉన్నాయి.  12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆరామాల వేడుకలకు ప్రపంచం నలుమూల నుంచి బౌద్దులు వస్తుంటారు.  అలా రాజధాని ప్రసిద్ధి అవుతుంది.  అమరావతి  రాష్ట్రం నడిమధ్యలో ఉన్నది కాబట్టి అటు ఇటు ఉన్న రెండు ప్రాంతాల వారికి అనుకూలంగా ఉంటుంది.  


వరదలను తట్టుకునే విధంగా నిర్మాణాలను చేపట్టాలని దానికి తగిన టెక్నాలజీ అందుబాటులో ఉన్నదని బాబు వాదన.  సముద్రం ఒడ్డున ఎన్నో నగరాలు ఉన్నాయి.  చెన్నై, ముంబై, కోల్ కతా వంటి ప్రసిద్ధికెక్కిన నగరాలు సముద్రం ఒడ్డున ఉన్నాయి.  అమరావతి సముద్రానికి దూరంగా ఉన్నది.  అయితే, కృష్ణా పరివాహ ప్రాంతం కాబట్టి వరదలు వస్తాయని, రాజధాని నగరం ముంపుకు గురవుతుందని వైకాపా వాదన.  టెక్నాలజీని ఉపయోగించి నిర్మాణాలు చేపడితే కట్టడాలు స్ట్రాంగ్ గా ఉంటాయని, వరదలనే కాదు.. భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మించవచ్చు అన్నది బాబుగారి వాదన. 


బాబుగారు అధికారంలో లేరు కాబట్టి అమరావతి కల కలగానే మిగిలిపోతుందేమో.  ఇప్పుడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టేందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు.  అమరావతి నిర్మణాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు.  పేరుకే అమరావతి రాజధాని.. విసిరేసినట్టుగా పాలన ఎక్కడెక్కడో జరుగుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: