ప్రతి ఒక్కరికి ఒక్కో కల ఉంటుంది.  ఆ కలల్ని నిజం చేసుకోవడానికి పాపం విపరీతంగా కష్టపడుతుంటారు.  ఇందులో భాగంగా గ్యాప్ లేకుండా పనిచేస్తుంటారు.  ఒకటికి నాలుగు పది ఉద్యోగాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతుంటారు.  ఎంత కష్టపడినా రోజులో ఉండేవి 24 గంటలు మాత్రమే.  అందులో ఐదు నుంచి 8 గంటలు నిద్రకు వినియోగించాలి. మిగిలిన 14 గంటలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. 


అయితే, ఉదయం లేచిన వెంటనే శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి తగినట్టుగా సిద్ధం చేయాలి.  దానికోసం అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి.  ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే కొందరు యోగ వ్యాయామం చేస్తారు.  కొందరు ఫ్రెష్ గా సొంతంగా వేడివేడి టీ తయారు చేసుకొని తాగుతారు.  కొందరు లేచిన వెంటనే పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెడతారు. 


అన్నింటికీ శరీరమే మూలం.  మన మనసును శరీరాన్ని ఏకం చేయగలిగితే ఎంతటి కష్టమైన పనిని సైతం ఈజీగా చెయ్యొచ్చు. ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టుగా ఎటుపడితే అటు పరుగులు తీయకుండా మనసును మొదట కంట్రోల్ చేయాలి.  అలా మనసును కంట్రోల్ చేస్తే.. దాన్ని సవ్యమైన మార్గంలో నడిచే విధంగా ట్రైనింగ్ ఇవ్వొచ్చు.  


అన్నింటికీ మన మనసే మూలం కాబట్టి.. మొదట దానికి కావాల్సినంత ట్రైనింగ్ ఇవ్వాలి.  ఎలా ఇవ్వాలి.. ఉదయాన్ని మంచి మాటలు చెప్పాలి.  మంచి ఆలోచించడం నేర్పించాలి.  లాలించాలి.. బుజ్జగించాలి.. దారిలోకి తెచ్చుకోవాలి.  మనసుకు ఒక్కసారి గెలుపు అంటే ఏంటో చూపించాలి.  గెలిస్తే మనం ఎలా ఉంటామో మనసుకు నేర్పించాలి.  ధైర్యం పోరాటం చేసే తెగువను ఆ మనకు నేర్పించాలి.  కొంతమందికి మనసు అదుపులో ఉన్నా.. వారి శరీరం మాత్రం అదుపులోకి రాదు.  గుర్రం రెడీ గా ఉన్నది.. దానిపై  సవారీ చేసే రౌతు సిద్ధంగా లేకుంటే ఉపయోగం ఏముంటుంది.  


అందుకే ఎప్పటికప్పుడు శరీరాన్ని కూడా ఫిట్ గా ఉంచుకోవాలి.  వ్యాయామం చేస్తుంటే శరీరం స్ట్రాంగ్ అవుతుంది.  ఫిట్నెస్ పెరుగుతుంది.  వివేకానంద చెప్పినట్టు ఇనుప నరాలు ఉక్కు కండరాలు కలిగిన వ్యక్తులను తనకు ఇవ్వండి దేశాన్ని సమూలంగా మార్చేస్తా అన్నారు.  సో, శారీరకంగా మనిషి బలంగా ఉన్నప్పుడే మనసు బలంగా మారుతుంది.  మనసును, శరీరాన్ని ఏకం చేస్తూ రిఫ్రెష్ అవుతుంటే.. మనిషి ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతాడు.. ఎలాంటి లక్ష్యాన్నైనా సాధిస్తాడు.. రూపాయి లేకపోయినా కోట్ల వ్యాపారం చేయగల సమర్ధత అతనిలో కనిపిస్తుంది.  మరి మీరు మీ శరీరాన్ని అలా రిఫ్రెష్ చేయించండి.. ఫలితం మీకే తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: