తెలంగాణలో రెండో సారి టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక మొదటగా సిఎం కెసిఆర్, హోంమంత్రి మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. కొన్నాళ్లకు మరో పది మందిని కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే అంతకు ముందు మంత్రులుగా ఉన్న కొందరికి సీట్లు దొరకలేదు. మంత్రులుగా తొలి క్యాబినెట్ లో ఉన్న నలుగురు ఎన్నికల్లో ఓడిపోవడంతో వాళ్లను పక్కన పెట్టేశారు. గెలిచిన హరీశ్ రావు, లక్ష్మా రెడ్డి, కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీలుగా ఉన్న నాయిని నరసింహా రెడ్డి, కడియం శ్రీహరిలను క్యాబినెట్ లోకి తీసుకోలేదు. ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, ఈటెలకు మరోసారి అవకాశమిచ్చారు కెసిఆర్. ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లికి తొలి సారి ఛాన్స్ దక్కింది. 


దాదాపు ఏడు నెలలు గడిచాక ఇప్పుడు మళ్లీ కేబినెట్ విస్తరణపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి కేసీఆర్. రెండో సారి గెలిచిన వెంటనే కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయటం వరుస ఎన్నికలు రావడంతో ఇన్నాళ్లు వేచి చూశారు. ఇప్పుడు కేటీఆర్ ని క్యాబినెట్ లోకి తీసుకోవటం అనివార్యంగా మారింది. కేటీఆర్ మంత్రి వర్గంలో లేకపోవటం వల్ల ఐటి పరిశ్రమల శాఖను ముఖ్యమంత్రే చూస్తున్నారు. గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు తమ వినతులను కెటిఆర్ ద్వారా సీఎంకు చేరవేసేవారు. కేటీఆర్ ఇప్పుడు మంత్రిగా కూడా లేకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అమెజాన్ లాంటి అతిపెద్ద క్యాంపస్ ని ఓపెన్ చేసిన కేటీఆర్ ప్రారంభోత్సవానికి వెళ్లలేకపోయారు. కొందరు ఎమ్మెల్యేలైతే బహిరంగ గానే కెటిఆర్ ని క్యాబినెట్ లోకి తీసుకోవాలని కోరుతున్నారు.


తెలంగాణ క్యాబినెట్ లో సీఎంతో కలిసి పధ్ధెనిమిది మంది వుండొచ్చు. యిప్పుడు క్యాబినెట్ పన్నెండు మందితో నడుస్తుంది. మరో ఆరుగురిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి దాకా క్యాబినెట్ లో ఒక్క మహిళ కూడా లేరు. ఈ సారి ఇద్దరు మహిళల్ని క్యాబినెట్ లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మధ్యే గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా చేశారు. ఈయనకు ఈ సారి కేబినెట్ లో బెర్త్ ఖాయంగా కనిపిస్తుంది. మహిళల్ని కేబినెట్ లోకి తీసుకుంటే వరంగల్ నుంచి రాథోడ్ కు అవకాశం రానుంది. 

మరో మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటే సబితా ఇంద్రారెడ్డికి ఛాన్స్ రావచ్చు. హరీశ్ రావు విషయంలో ఇంకా స్పష్టత లేదు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సండ్ర వెంకట వీరయ్య లేక మరొకరికి చాన్స్ దక్క వచ్చు, శ్రావణ మాసం ముగిసే లోపు క్యాబినెట్ విస్తరణ పూర్తి చేసినా ఆశ్చర్యం లేదు. కేవలం కేటీఆర్ గుత్తాను మాత్రమే ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకుని మిగిలిన వారిని రెండు మూడు నెలల తరువాత తీసుకుంటారన్న అంచనా కూడా ఉంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేంద్ర పై సీఎం కేసీఆర్ పై అసంతృప్తిగా ఉన్నారు. కలెక్టర్ల సమావేశంలో రహస్యంగా చర్చించిన విషయాలను రెవిన్యూ ఉద్యోగులతో ప్రస్తావించారనే కోపంతో ఉన్నారు సీఎం. ఈటెల రాజేందర్ ని క్యాబినెట్ నుంచి తప్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. రెండోసారి క్యాబినెట్ లోకి తీసుకోవటం కూడా అయిష్టం గానే జరిగినట్టు సమాచారం. ఇప్పుడు ఈటెలను తప్పించి మరో బీసీ నేతను కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలున్నాయి. వరంగల్ నుంచి వినయ్ భాస్కర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ క్యాబినెట్ బెర్తుని ఆశిస్తున్నారు.













మరింత సమాచారం తెలుసుకోండి: