టీడీపీ నాయ‌కులు, మాజీ విప్ కూన ర‌వికుమార్ రెచ్చిపోయాడు. ప్ర‌భుత్వ అధికారుల‌పై బూతుల‌తో తిట్ల‌దండ‌కం అందుకున్నాడు. శ్రీ‌కాకుళం జిల్లా సారుబుజిలి మండ‌లం స్పంద‌న కార్య‌క్ర‌మంలో అధికారుల‌పై ర‌వికుమార్ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. మ‌హిళా అధికారి ప్రాజెక్టు ఆఫీస‌ర్‌ను ర‌వికుమార్ ఫోన్‌లో బెదిరించాడు. ఎంపీడీవో, త‌హ‌శీల్దార్, ప్ర‌త్యేక అధికారుల‌ను దుర్భాష‌లాడారు. ముందుగా  మ‌హిళా అధికారితో ర‌వికుమార్ మాట్లాడిన సంభాష‌ణ ఇలా ఉంది.

ర‌వికుమార్ :  నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేస్తావా..?  చెప్పింది వింటావా..?  నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తే నేనేం చేస్తానో నువ్వు భ‌విష్య‌త్తులో చూస్తావు. నువ్వు చెప్పింది రూల్ కాదు. నేను చెప్పిందే రూల్. అంత‌కు మించి నువ్వు ఏం చేసినా అందుకు నువ్వు ప్ర‌తిఫ‌లం అనుభ‌విస్తావు.

మ‌హిళా అధికారి : ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారుల‌తో మాట్లాడండి
సార్‌ర‌వికుమార్ : ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారుల‌తో కాదు. ఎవ్వ‌రితోనూ మాట్లాడాల్సిన ప‌నిలేదు. నేను చెప్పాను. జ‌స్ట్ ఇంప్లిమెంటెడ్ ద‌ట్సాల్‌. 
మ‌హిళా అధికారి : అంద‌రూ తీసేస్తున్నారు
సార్‌ర‌వికుమార్ : బియాండ్ ద‌ట్ ఏమైనా మీరు యాక్ట్ చేస్తే మాత్రం మంచిగా ఉండ‌దు.
మ‌హిళా అధికారి : అంద‌రూ ఇళ్ల‌ళ్ల‌కీ తీసేస్తున్నారు. ప్రభుత్వానికి అమౌంట్ పే చేయ‌కుండా.

ర‌వికుమార్ : విన‌మ్మా.. వినాలి నువ్వూ. అస‌లు నీకు మ‌ర్యాద‌గ మాట్లాడం వ‌చ్చా.. రాదా..?  నీ ఉద్యోగం నీవు చేయ‌డం లేదు. నువ్వు రాజ‌కీయం చేయాల‌నుకుంటున్నావు. నీకు మ‌ళ్లీ క్లియ‌ర్‌గా చెబుతున్నాను. చెప్పింది చేయ‌కుంటే నేనేంటే నువ్వు మ‌ళ్లీ చూస్తావు. లో ప్రొఫైల్‌గా వెళ్లూ.. లో ప్రొఫైల్‌గా వెళ్లి ఉద్యోగం చేసుకో. అగ్రెసివ్‌గా మాట్లాడి.. అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తే మాత్రం మ‌ర్యాద ఉండ‌దు అంటూ ఆ మ‌హిళా అధికారిని బెదిరింపుల‌కు గురి చేశాడు.

ఇలా ఎవ‌డూ న‌న్ను ఆప‌లేడు. త‌లుపులు వేసి బాదేస్తానంటూ కూన ర‌వికుమార్ మ‌హిళా అధికారుల‌పై చిందులు తొక్కాడు. స‌రుజు బుజిలి ఎంపీడీవో కార్యాల‌యంలోకి త‌న అనుచ‌రుల‌తో వెళ్లిన కూన ర‌వికుమార్ బూతులు తిడుతూ దూషించాడు. మీ సీట్లోనే కూర్చుంటా, ఎవ‌డొస్తాడో చూస్తానంటూ అధికారుల‌పై విరుచుకుప‌డ్డాడు. అధికారుల‌కు, ప్ర‌భుత్వానికి హ‌నీమూన్ టైమ్ అయిపోయిందంటూ ధూషించాడు.

కూన తిట్టిన బూతుల‌తో ఆ మండ‌ల సిబ్బంది మ‌న‌స్థాపానికి గుర‌య్యారు.  ప్ర‌భుత్వ అధికారుల‌ను ధూషించిన కూన ర‌వికుమార్‌పై రాష్ట్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అధికారుల‌ను బెదిరించిన కూన ర‌వికుమార్‌పై ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంఘం అధ్య‌క్షుడు కృష్ణ‌య్య డిమాండ్ చేశాడు. ఆ త‌రువాత ఉద్యోగ సంఘం నేత‌లంతా జిల్లా క‌లెక్ట‌ర్‌ను క‌లిసి కూన ర‌వికుమార్‌పై ఫిర్యాదు చేశారు. విధుల‌ను అడ్డుకోవ‌డం, వ్య‌క్తిగ‌తంగా ధూషించ‌డంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని వారు నిర్ణ‌యించారు. మొత్తానికి ర‌వికుమార్ మ‌రో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అవ‌తార‌మెత్తాడంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: