తల్లిదండ్రులను వదిలి ఎక్కడో పాఠశాలలో ఇంటికి దూరంగా చదువుకునే అమ్మాయిల పరిస్దితి గురించి చెప్పవలసిన అవసరం లేదు.చదువుకునే చోటే,టీచర్ ను తల్లి దండ్రులుగా,గురువులుగా,తోటి విధ్యార్ధులను అన్నచెల్లెల్లుగా, అక్క తమ్ముళ్లు గా భావించుకొంటారు.స్కూలంటే ఓ కర్మాగారం కాదు,అమృతవనం.ఎన్నో జీవితాలకు వెలుగు చూపే సౌధం.అలాంటి చోటే ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయి.ఆలయంగా భావించే బడిని కొందరు కీచక టీచర్లు తమ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగ పడే ప్రదేశంగా భావిస్తున్నారు.ఈ కాలంలో ఆడపిల్లల్ని,ఎటైన పంపాలంటేభయం,కనీసం విధ్యాబుద్ధులైన నేర్చు కొమ్మని పంపా లన్నా తెలియనిఆందోళన.ఇంతగా ఆలోచించినా జరగవలసి న దారుణాలు జరుగుతూనే వున్నాయి.ఇప్పుడు చదవబోయే సంఘటన కూడ అలాంటిదే..




తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలో బాలికల గురుకుల పాఠశాలలో ఉన్న వైఎస్ ప్రిన్సిపల్‌ కృపారావు, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడు తున్నాడట.సాధారణ తనిఖీలో భాగంగా సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల జిల్లా సమన్వయకర్త టి.రాధా సుధారాణి మంగళవారం పాఠశాలలో విచారణ చేపట్టారు. ముందుగా ఆమె ప్రిన్సిపల్, స్టాఫ్‌ను విచారించిన తర్వాత స్టూడెంట్స్‌ను విచారించారు.ఈ సందర్భంగా వైఎస్ ప్రిన్సిపల్ కృపారావు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని,తమపై కీచక పర్వానికి పాల్పడుతుంటే ఎవరికి చెప్పాలో తెలియక,నిస్సహాయ స్థితిలో ఆ బాధను భరిస్తూ నెట్టుకొస్తున్నామని చెప్పి బోరుమన్నారు..



దీంతో ఆమె కృపారావుపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.ఈ విషయం పై కృపారావు స్పందిస్తూ విద్యార్థినులు తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కుట్రలో భాగమేనని,స్కూల్‌లోని కొందరు లేడీ టీచర్లే తనపై కుట్రపన్ని బాలికలతో అలా చెప్పించారని ఆరోపించారు.ఇక కొసమెరుపేంటంటే కృపారావు ఇలాంటి చర్యలకు పాల్పడు తున్నట్లు బాలికలెవరూ గతంలో తనకు ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపల్ ప్రశాంతికుమారి చెబుతున్నారట...ఈ విషయం తెలిసిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు జరిగిన దాన్నే చెబుతున్నారని,ఒకవేళ అతను అలా ప్రవర్తంచి వుండకపోతే అతనిపై నిందవేయవలసిన అవసర మేంటని ప్రశ్నిస్తున్నారు...ఈ విషయంలో అతనిపై తగుచర్యలు తీసుకోవాలని అధికారుల్ని వారు కోరారు..

మరింత సమాచారం తెలుసుకోండి: