నాయకుడు నడిపించేలా ఉండాలి.. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.. తప్పు చేసిన వాడిని తప్పు అనగలగాలి.. తమ నాయకుడు తప్పు చేసినప్పుడు.. ఆ తప్పును ఒప్పుకోగలగాలి.. మరోసారి ఇలాంటి తప్పులు తమ పార్టీ నుంచి జరగవని ప్రజలకు భరోసా ఇవ్వగలగాలి..అప్పుడే ఆ పార్టీ పట్ల ప్రజలకు విశ్వసనీయత ఉంటుంది.


కానీ చంద్రబాబు ఇందుకు ఫుల్ రివర్స్ లో ఉన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా... తప్పు చేసిన నాయకుడికే మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజా ధనాన్ని దోచుకున్న వారికి అండగా నిలిచి ప్రజా వ్యతిరేకిగా చంద్రబాబు ముద్ర వేయించుకున్నారు. 14 కేసుల్లో నిందితుడైన కోడెలకు అనుకూలంగా చంద్రబాబు వ్యవహరించడం పార్టీలోనే విమర్శలకు తావిస్తోంది.


తాజాగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను దొంగతనం కేసు కోడెల పరువును నిలువునా తీసేసింది. సోషల్ మీడియాలో కోడెలపై దారుణంగా కామెంట్లు వస్తున్నాయి.. ఇలాంటి నాయకుడిని సపోర్ట్ చేస్తే దాని ప్రభావం పార్టీపైనా ఉంటుంది. మాజీ స్పీకర్ కోడెల విషయంలో చంద్రబాబు ఇంతవరకూ పెద్దగా స్పందించలేదు. ఇన్నిఆరోపణలు వస్తున్నా కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండిచనైనా లేదు. కాస్త గ్యాప్ తీసుకుని కోడెలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే అంతా అనుకున్నారు.


ఇంతలోనే గుండెపోటు హైడ్రామాతో కోడెల ఆసుపత్రిలో చేరాడు. చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి కోడెలను పరామర్శించి వచ్చాడు. తెలుగు తమ్ముళ్ళు ఎన్ని తెగులు పనులు చేసినా చంద్రబాబు వాళ్లపై ఏ చర్యలూ తీసుకోడన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. గతంలో చింతమనేని, బోండా ఉమ, యరపతినేని వంటి నేతలపై అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు కనీసం విచారణకు కూడా ఆదేశించలేదు. దాని ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైంది.


ఇప్పుడు కోడెల అక్రమాలు వెలుగులోకి వచ్చినా, అసెంబ్లీ ఆస్తుల దొంగతనంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా చంద్రబాబు కోడెలను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీలోని వక్రబుద్దులపై చర్యలు తీసుకోకపోతే.. తెలుగుదేశం పార్టీ ఇమేజ్ మరింత మసకబారడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: