వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు. పెళ్లి చేసుకునే నిరుపేద చెల్లమ్మలకు అక్షరాల రూ.లక్ష ఇస్తానంటూ ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు హామీ ఇచ్చారు. ముఖ్యంమంత్రిగా ఎన్నికైన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించి మండల మహిళా సమాఖ్యలు, మెప్మా కార్యాలయాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ పథకం కింద దరఖాస్తుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. వివాహానికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి. వధువు, వరుడు ఇద్దరూ ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి. ఏపీ రాష్ట్ర నివాసితులై ఉండాలి. వివాహం ఏపీలోనే చేసుకోవాలి. ఇద్దరికీ ఆధార్‌కార్డు, వధువు తప్పనిసరిగా తెల్లరేషన్‌కార్డు కలిగి ఉండాలి.


వధువు బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం చేసి ఉండాలి. వివాహ తేదీ నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. తొలిసారి వివాహం చేసుకునే వారు మాత్రమే పథకానికి అర్హులు. వరుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడైనా వధువు ఏపీకు చెందినట్లయితే పథకానికి అర్హులే.


మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయాల్లో పెళ్లి కానుక దరఖాస్తును నమోదు చేస్తున్నారు. నమోదుచేసిన వెంటనే అప్లికేషన్‌ ఐడీ నంబర్‌ అభ్యర్థుల మొబైల్‌ నంబర్‌కు వస్తుంది. అనంతరం కళ్యాణమిత్రలు వచ్చి వివరాలు సేకరించి, దర్యాప్తుచేస్తారు. ఆ తర్వాత ముందుగా రావాల్సిన 20శాతం నగదును పెళ్లి కూతురు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.


మీసేవా జారీ చేసిన నేటివిటి, కమ్యూనిటీ, జనన ధ్రువీకరణ పత్రం. వయస్సు నిర్ధారణకు పదో తరగతి లేదా ఇంటిగ్రేటెడ్‌ మీ–సేవా సర్టిఫికెట్‌. కుల ధ్రువీకరణ పత్రం, వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌. తెల్లరేషన్‌ కార్డు లేదా మీ–సేవా ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. ‘వెలుగు’లోనే దరఖాస్తు చేయాలి. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లక్ష రూపాయలు ఇస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: