ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తెలుగు నేతల్లో ఇటీవలి కాలంలో అత్యున్నత రాజ్యాంగపదవికి ఎంపికైనవారు.. ఉపరాష్ట్రపతి పదవి వరకూ వెళ్లిన నేత.. ముందు ముందు రాష్ట్రపతి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. చక్కటి వక్త.. డైలాగ్ కింగ్.. ఇంత పేరున్న ఆయన ఇటీవల జూనియర్లతో క్లాసులు పీకించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన నలుగురు ఎంపీల కారణంగా.. దాన్ని విలీనంగా వెంకయ్య ఆమోదించిన కారణంగా వెంకయ్య విమర్శల పాలయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా నేతృత్వంలో పార్లమెంట్‌లో స్పీకర్ల సదస్సు లో పాల్గొన్న ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ వెంకయ్య తీరును తప్పుబట్టారు. ఇటీవల నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలో విలీనం చేసుకోవడం దారుణమని చెప్పారు.


ప్రజా ప్రతినిధులు పార్టీ మారేటప్పుడు నైతిక విలువలను పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలుపొందాలన్నారు. ఉగాండాలో జరగనున్న స్పీకర్ల సదస్సులో చర్చించేందుకు 10 అంశాలను ఎంపిక చేశారని తమ్మినేని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత నైతికతను పక్కన పెట్టారని తమ్మినేని అన్నారు. ఏపీలో గత ప్రభుత్వంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని.. వారిలో నలుగురితో మంత్రులుగా ప్రమాణం చేయించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.


టిడిపి ఎమ్.పిల విలీనాన్ని దారుణంగా అబివర్ణించిన సీతారామ్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చర్యను తప్పుపట్టినట్టే.. అయితే టీడీపీ ఎంపీల విలీన ప్రక్రియ వాస్తవానికి వెంకయ్య నాయుడికి కూడా ఇష్టం లేదనే చెబుతారు. కానీ పార్టీలో మోడీ- అమి।త్ షాలను కాదని నిర్ణయం తీసుకునే సత్తా వెంకయ్యకు ఉండకపోవచ్చు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నందువల్ల స్వతంత్రత్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నా... ఆ తర్వాత భవిష్యత్ ఉండకపోవచ్చన్న భయం వెంకయ్యను వెంటాడుతూ ఉండొచ్చు. ఏదేమైనా ఎక్కడా వేలెత్తి చూపించుకోని వెంకయ్య.. టీడీపీ ఎంపీల విలీనం విషయంలో మాత్రం మాటపడాల్సివస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: