సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పాలనపై తనదైన ముద్ర కోసం తపించారు. గ్రామ సచివాలయం భావనను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రతిష్ఠాత్మకంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ పారదర్శకంగా ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ నియమకాలు చేపట్టారు. ఓ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకూ ఓ వాలంటీర్ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ 50 ఇళ్లకు సంబంధించిన బాగోగులు ఆ వాలంటీర్ చూడాల్సి ఉంటుంది.


ఈ ఉద్యోగానికి నెలకు రూ. 5000 వేతనం కూడా ప్రకటించారు. ఈ పోస్టుల నియమాకాల్లో వైసీపీ వారి నియమించారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది కూడా. అయితే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాలంటీర్లు ఏకంగా సీఎం జగన్ కే షాక్ ఇస్తున్నారు. ఎందుకంటే.. నియమించిన వారిలో ఇంకా 50 వేల మంది వరకూ ఉద్యోగాల్లోనే చేరలేదట. మరి పిలిచి ఉద్యోగం ఇస్తే వీరు ఎందుకు అందులో చేరనట్టు..?


ఇందుకు సమాధానం.. ఆ ఉద్యోగం జాబ్ కార్డు అని తెలుస్తోంది. వాలంటీర్ తమకు కేటాయించిన గ్రామంలో మొత్తం 30రకాల పనులు చేసేలా జాబ్‌చార్టును సిద్ధం చేశారు. తమకిచ్చే రూ. 5వేలుకు ఇంత చాకిరి ఎక్కడ చేస్తామని చాలా మంది ఉద్యోగంలో చేరేందుకు ఇంట్రస్టు చూపించడం లేదట. ఈ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9.62లక్షల మంది ఈ పోస్టులకు అప్లయి చేసుకొన్నారు. వారిలో 6.73లక్షల మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇంటర్వ్యూల్లో 2.46లక్షల మందిని ఎంపిక చేశారు. వారికి వారం పాటు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.


ఇలా ఉద్యోగాలు అందుకున్న వారిలో 50వేల మందికి పైగా విధుల్లోకి చేరలేదట. వీరిలో గ్రామ సచివాలయాల స్థాయిలో 40వేలమంది, వార్డు సచివాలయాల పరిధి లో 10వేల మంది ఉన్నారు. అయితే రెండున్నర లక్షల ఉద్యోగాల్లో 50 వేలమంది చేరకపోవడం పెద్ద విషయం కాదని.. క్రమంగా వారు కూడా చేరతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: