జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో తాజా పర్యటించారు. రాజధాని మార్పు అంశంపై ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్ పై ఘాటు కామెంట్లు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా వైసీపీ అధినేతల ప్రవర్తిస్తున్నాడన్నారు. అధికారంలోకి వస్తే రాజధాని మీ జిల్లాకు తీసుకుపోతారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారిగా జనం మధ్యకు వచ్చింది ఈ రాజధాని అంశంపైనే.. ఇదే అంశంపై ఇప్పటికే టీడీపీ, బీజేపీ నేతలు పోరాటం ప్రారంభించారు. అయితే పవన్ పోరాటాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.


జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు నిజంగా రాజధానిపై ప్రేమ ఉంటే ఇక్కడ ఎందుకు పోటీ చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిలదీశారు. కనీసం వారి పార్టీ అభ్యర్థినైనా ఎందుకు పోటీకి పెట్టలేదని ప్రశ్నించారు. లెప్ట్‌ పార్టీ అభ్యర్థి తరఫున ఎందుకు ప్రచారం చేయలేదన్నారు. లోకేష్‌ గెలుపునకు తెర వెనుక పవన్‌ ప్రయత్నాలు ప్రజలకు తెలుసు అన్నారు.ఇవాళ రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తే జనం నమ్మరని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ రాజధాని పర్యటనపై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్కే మీడియాతో మాట్లాడారు.


చంద్రబాబు ప్యాకేజీ అందినప్పుడు ఒకలా..అందినప్పుడు మరోలా మాట్లాడటం పవన్‌కు అలవాటు అయ్యిందన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను పవన్‌ బయటపెట్టాలని, అక్రమాలు జరుగుతున్నాయని అప్పట్లో బేతపూడిలో పవన్‌ ప్రకటించారని గుర్తు చేశారు. భూసేకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని పవన్‌ ప్రకటించారని తెలిపారు. ఆ తరువాత నాలుగు సార్లు భూసేకరణ జరిపితే పవన్‌ ఏమయ్యారని ప్రశ్నించారు.


జనసేన అధినేత ఇప్పటికీ టీడీపీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారనే విమర్శలకు ఆయన వైఖరే ఆస్కారం కల్పిస్తోంది. పవన్ రాజధాని ప్రాంతంలో పోటీ చేయకపోవడమే కాక.. ఆ ప్రాంతంలో పోటీ చేసిన కమ్యూనిస్టుల తరపున గట్టిగా పోరాడలేదనే విమర్శలు ఉన్నాయి. మరి వీటికి పవన్ ఏం సమాధానం చెబుతారో..?


మరింత సమాచారం తెలుసుకోండి: