వైసీపీ అధినేత జగన్ సీఎం అయిన తర్వాత.. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలోని అవినీతిని టార్గెట్ చేశారు. గతంలో ఏ కోర్టూ తాను అవినీతి చేశానని ధ్రువీకరించకపోయినా.. లక్ష కోట్లు తిన్నాడంటూ ప్రచారం చేసినందుకు జగన్ టీడీపీపై పీకలదాకా కోపంతో ఉన్నారేమో.. అందుకే టీడీపీ నేతల అవినీతిని బయటపెట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.


అందుకే అధికారంలోకి రాగానే పోలవరం టెండర్లపైనా, రాజధాని ప్రాజెక్టులపైనా ఇతర అక్రమాలపైనా ఏకంగా ఓ కమిటీని వేసేశారు. ఓ మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఆ కమిటీ అదే పనిలో ఉంది. ఇది ఇలా సాగుతుండగానే జగన్ సర్కారు మరో అవినీతి బాగోతంపై దృష్టి సారించింది. అదేంటంటే..విద్యార్థులకు పంపిణీ చేసే స్కూల్‌ యూనిఫామ్స్‌లో కూడా గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందట. ఆప్కో పేరుతో యూనిఫామ్స్‌ సరఫరాలో తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి బాగోతాన్ని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట.


స్కూల్‌ యూనిఫామ్స్‌ అవకతవకలపై సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు. విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. గత ఐదేళ్లలో యూనిఫామ్స్‌ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు తెరిచేసరికే యూనిఫామ్స్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.


1994-2004 మధ్య కాలంలో చంద్రబాబు అంటే మంచి అడ్మినిస్ట్రేటర్ అనే పేరు ఉండేది. ఆయన అవినీతి సహించడన్న బ్రాండ్ ఉండేది. కానీ ఆ తర్వాత పదేళ్లు ప్రతిపక్షంలో ఉండటం.. పార్టీని నడిపేందుకు కొందరు కార్పొరేట్ కోటీశ్వరులపై ఆధారపడ్డారు. ఆ తర్వాత వారే ఆయన్ను తప్పుదోవ పట్టించారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన పాత ఇమేజ్ ను పూర్తిగా పక్కకు పెట్టి పచ్చదళాల దోపిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్లేషకులు చెబుతుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: