కాంగ్రెస్ లో పదేళ్ల పాటు అధికారం అనుభవించి కీలక సమయంలో ఆ పార్టీ నుంచి జంప్ అయిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వల్ల కాషాయానికి కలిసొచ్చేది ఏదీ లేదన్నది వాస్తవం. ఆయన తన సామాజికవర్గం ఓట్లను ఇటు మార్చలేకపోయారు. తాను పనిచేసిన కాంగ్రెస్ నుంచి ఒక్క నాయకుడిని కూడా తేలేకపోయారు. ఇక ఏపీలో తన వల్ల బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంక్ ఏమీ లేదు. ఆయన మాజీ మంత్రి నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షుడుగా మారడం తప్ప పార్టీకి ఆయన వల్ల లాభం లేదన్న మాట అంతటా వినిపిస్తోంది. 


ఈ నేపధ్యంలో కన్నా ఈ మధ్య సౌండ్ బాగా పెంచారు. ఎందుచేంతంటే తన సీటు కిందకు నీళ్ళు చేరుతున్నాయన్న ఆవేదనతోనే. టీడీపీ తమ్ముళ్ళు  సుజనాచౌదరి బ్యాచ్ బీజేపీలోకి  అరంగేట్రం చేయడంతో కన్నా జాగ్రత్త పడిపోయారు. వెంటనే వైసీపీ పైన జగన్ మీద దూకుడుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఏపీలో ఒక్కసారిగా బీజేపీ వాయిస్ పెంచి మరి మూడు నెలల వైసీపీనే సకల పాపాలను కారణమని కూడా కన్నా చేస్తున్న హడావుడి,  వాదన పూర్తిగా ప్రో టీడీపీగా ఉంది.


దాంతో ఏపీ బీజేపీలో ముసలం మొదలైంది. కన్నా టీడీపీకి అనుకూలంగా మాట్లాడడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. రాజధాని అమరావతి విషయంలో అవినీతి జరిగిందన్నది బీజేపీ కూడా విమర్శలు  చేసింది, టీడీపీ అవినీతిని  అంగీకరించింది. అటువంటి బీజేపీ ఇపుడు టీడీపీని సమర్ధించేలా మాట్లాడడం వల్ల పార్టీ మరింతగా దెబ్బతిండమే కాకుండా సైకిల్ పార్టీకి మైలేజ్ పోతోందన్న వాదనను మరో వర్గం ముందుకు తెస్తోంది.


ఈ విషయంలో కన్నా తప్పుడు  రూట్లో వెళ్తున్నారని ఆయన్ని కట్టడి చేయాలంటూ బీజేపీలోని రెండవ వర్గం కేంద్రానికి ఫిర్యాదు చేయనుంది. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన రెండు వర్గాల మీటింగులతో  ఏపీ బీజేపీలో వర్గ భేదాలను బయటపెట్టాయి. కన్నాతో ఓ వర్గం భేటీ అయితే ఆయనకు వ్యతిరేకంగా మరో వర్గం అదే  హైదరాబాద్ లో సమావేశమై కన్నా తీరు మీద ఫిర్యాదుకు రెడీ అయింది. 


రెండవవర్గంలో సుధీష్ రాంభోట్ల, ఐవీయార్ క్రిష్ణారావు వంటి వారు ఉన్నారు. ఇక వీరికి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మద్దతు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కన్నా అతి వల్ల సీన్ కాలే ప్రమాదం ఉందని కాషాయ శిబిరంలో వినిపిస్తున్న మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: