హిందువుల పండుగల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది సామాన్యంగా మన సంప్రదాయంలో వస్తున్న రీతి. నాటి పురాణాలలో జరిగిన దుష్టశిక్షణ లో రాక్షసులు సంహారం అయితే ఈనాటి మన మహాభారతం లో ఎవరిని శిక్షించాలి అని నాగపూర్ వాసులు వినూత్నంగా ఆలోచించారు. మనకు నిత్యం ఆపదను తీసుకువచ్చే పాకిస్తాను ఎన్నుకున్నారు.

నాగపూర్ లో దుష్టశిక్షణ కు దురాత్ముల ను దానం చేసే ఒక ప్రత్యేక రీతి ఉన్నది. అందరూ ఒకచోట చేరి ప్రతి ఏటా ఎంతో వైభవంగా సంబరాలు జరుపుకుంటారు. తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అతని దిష్టిబొమ్మ పై పాకిస్తాన్ మీది కాదు అంటూ వ్యాఖ్యలు రాసి దహనం చేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

నాగపూర్ లో ఈ రీతి గత 130 ఏళ్లుగా కొనసాగుతోంది. అప్పట్లో బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి కావాలని కోరుకుంటూ వారి దిష్టిబొమ్మలను దగ్ధం చేసే రీతి మొదలైంది. ఈ వేడుకలను మార్బల్ ఉత్సవాలు అని అంటారు. ఈ ఏడాది కాళీ ఉత్సవాలలో జరిగిన సంబరాలలో దిష్టిబొమ్మను దహనం చేసే ముందుగా ఊరంతా ఊరేగించడం జరిగింది. ఊరేగింపులో వీధులలో భక్తులు సమాజానికి నష్టం చేకూర్చే దుష్టశక్తులు అంతం కావాలి అని వేడుకుంటారు. పెద్ద పెద్దగా నినాదాలు కూడా పాడుతూ ఉంటారు.

తాజాగా నిత్యం మారుతున్న కశ్మీర్ వాతావరణం నడుమున ఈ సంబరాలు జరగడం ఒక విశేషం. ఇక దసరా వేడుకలు మరియు దీపావళి ముందు జరిగే నరకచతుర్దశి వేడుకల్లో కూడా ఇది వివిధ నగరాలలో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతీయుల్లో పెరిగిన ఈ ఐక్యత మరియు ఆత్మవిశ్వాసం సంతోష పడాల్సిన విషయం. మనదేశం రోజురోజుకీ మరింత దృఢంగా తయారవుతుంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ.


మరింత సమాచారం తెలుసుకోండి: