వన మహోత్సవం సందర్భంగా ఏపీ సీఎం మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇకపై ఏపీలో ఏ ప్రరిశ్రమ ప్రతిపాదన వచ్చినా.. ముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ వచ్చిన తర్వాతే దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్పారు. ఆయన ఏమన్నారంటే.. " ఇవాళ ఫార్మా పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాం. పరిశ్రమలు వచ్చేసమయంలో పర్యావరణానికి మేలు చేస్తుందా? అన్నది ఆలోచన చేయాలి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును ప్రక్షళన చేయబోతున్నామని చెబుతున్నాను.


ఫార్మా రంగంలో లక్ష టన్నుల కాలుష్యం వస్తుందని నా దృష్టికి వచ్చింది. కేవలం 30 వేల టన్నులు మాత్రమే ఆడిట్‌ జరుగుతుందని, మిగతాది కాల్చివేయడం, లేదా సముద్రంలో వేయడం జరుగుతుంది. పరిశ్రమల్లో ఎంత కాలుష్యం వస్తుంది. ఏ రకంగా మనం డిస్పోజ్‌ చేయాలో ఆలోచన చేయాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకోబోతోంది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం. ఈ ఏడాది అక్షరాల ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఎలక్ట్రసిటీ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం.


ఈ మధ్య కాలంలో వ్యవసాయానికి సంబంధించిన రివ్యూ తీసుకునేసమయంలో ఓ సీనియర్‌ పాత్రికేయుడు సాయినాథ్‌ చెప్పిన కొన్ని విషయాలు చెప్పారు. అవి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆయన అన్న మాటలు ఏంటో తెలుసా? కేవలం రెండు మూడు నెలలు పండే పంటలు చేసే సమయంలో , మిగతా తొమ్మిది నెలలు భూమిపై నేరుగా సూర్యకిరణాలు పడటంతో రాయలసీమలోని భూభాగం ఎడారిగా మారుతుందని చెప్పారు. భూమిపై ఏడాదంతా గ్రీన్‌ కవర్‌ లేకపోతే వేగంగా భూభాగం ఎడారిగా మారుతుందన్నది ఎవరూ కూడా మరిచిపోకూడదు...అన్నారు జగన్.


జగన్ చెప్పిన విషయం బాగానే ఉంది. కానీ ఇలాంటి నిబంధనలు పెడితే..పరిశ్రమలు ఏపీకి వస్తాయా.. పారిశ్రామిక వేత్తలు ఏపీవైపు చూస్తారా... ఇప్పటికే రాజధాని లేని.. ఏపీ.. ఇలాంటి కఠినమైన నిబంధనలు పెడితే పరిశ్రమలు రాక ఇబ్బందిపడదా.. అప్పుడు యువతకు ఉపాధి దొరుకుందా.. అన్నప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ పర్యావరణమే బాగా లేకుంటే భావి తరాలు ఇబ్బందిపడతాయన్న విషయమూ మరువ కూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: