అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజల సొమ్మును ధారాదత్తం చేశారా.. తెలుగుదేశం నాయకులకు.. తనకు నచ్చిన పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు జనం సొమ్మును దోచి పెట్టారా.. అడ్డగోలుగా అవినీతి బాగోతాలు సాగించారా.. అవునంటున్నారు.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. అమరావతి భూ కుంభకోణాలు, ప్రాజెక్టుల అవినీతి బాగోతాలు చూస్తే కళ్లు తిరుగుతున్నాయని కామెంట్ చేస్తున్నారు.


అమరావతిలో చంద్రబాబు అవినీతికి ఆయన ఓ ఉదాహరణ చెప్పారు. హైటెక్ కరంట్ పోల్స్ అంటూ ఒక్క కరెంటు స్తంభానికి 20 లక్షల రూపాయలు బిల్లులు చూపించారన్నారు బొత్స. ఓ సీసీ టీవీ వైరు, కేబుల్ వైర్లలాంటివి నాలుగు పెట్టి ఒక్క కరంట్ పోలుకు 20 లక్షలు చెల్లించారని తెలిపారు. మొన్నటి వర్షాలకు 20 లక్షల రూపాయల కరంట్ పోల్ కూడా కూలిపోయిందని గుర్తు చేశారు. ఇది అమరావతిలో చంద్రబాబు దుబారాకు ఓ సాంపిల్ మాత్రమే అంటున్నారు మంత్రి బొత్స.


ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు అన్న చందంగా రాష్ట్ర పరిస్థితి మారిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు, లోకేష్‌ ప్రధాన నిందితులని ఆరోపించారు. రాజధాని పరిధి ప్రాంతంలో భూముల విషయంలో బినామీ, దురాక్రమణకు గురైన భూముల గురించి సమీక్ష జరిపాము. రోడ్ల టెండర్లలో ధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నం చేశారు. తాత్కాలిక సచివాలయం పేరుతో చదరపు అడుగును రూ.10 వేలు చేశారు.


ఈ కుంభకోణాలలో చంద్రబాబు, లోకేష్ ప్రధాన నిందితులు కాబట్టి ఎల్లోమీడియాతో విమర్శలు చేయిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రశ్నించని పవన్‌ ఇప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ బాషా తీరు టీడీపీ అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు ఉంది. తెలుగుదేశం-2 అయిన పవన్ కల్యాణ్ మాటలు ప్రజలు గమనిస్తున్నారని, ద్వంద్వ వైఖరి మార్చు కోవాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: