ఆర్ధిక సంక్షోభంతో పాకిస్థాన్ ఇప్పుడు అల్లాడిపోతోంది. అయినా పాక్ .. భారత్ మీద యుద్ధం కోసం కాలు దువ్వుతుంది. కాశ్మీర్ విషయంలో విషం కక్కే వ్యాఖ్యలు ఇమ్రాన్ ఖాన్ చేస్తున్నారు. అయితే పాక్ లో ప్రధాన మంత్రి మీద కూడా మిలిటరీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మిలిటరీ చేతిలో పాక్ ప్రధాని కీలు బొమ్మలా ఉంటాడని చెప్పాలి. దీనితో పాక్ మిలిటరీ భారత్ తో యుద్దానికి సై అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది.  ఇన్ని రోజులు కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతి పత్తిని అడ్డు పెట్టుకొని కాశ్మీర్ లోపలకి ఉగ్రవాదులను పంపి మారణ హోమం జరిపేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అయితే పాక్ .. కాశ్మీర్ విషయంలో నానా హంగామా చేసింది. కానీ ప్రపంచ దేశాలు పట్టించుకోలేదు.


ఇప్పుడేమో కాశ్మీర్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ పాక్ లో ర్యాలీని నిర్వహిస్తూ తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అయితే ఎప్పుడైతే కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అయ్యిందో .. ఇప్పుడు భారత్ కళ్ళు పీఓకే మీద పడ్డాయి. దీనితో పాక్ లో అసలైన వణుకు పుడుతుంది. ఇన్ని రోజులు కాశ్మీర్ కు స్వయం ప్రతి పత్తి ఉండటంతో పాక్ చాలా ఆటలు ఆడింది. కానీ ఇప్పుడు పీఓకే ను పాక్ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


ఏ మాత్రం తేడా జరిగిన భారత్ .. పీఓకేను భారత్ లో కలిపేసుకుంటుందని పాక్ కు బాగా తెలుసు. అయితే కాశ్మీర్ విషయంలో ఐరాస పట్టించుకోకపోవడంతో . .పైగా ఇది భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పడంతో పాక్ ఎక్కడ లేని అసహనానికి గురవుతోంది. అందుకే విచక్షణ కోల్పోయి రాబోయే రోజుల్లో భారత్ తో పూర్తి స్థాయి యుద్ధం తప్పదని పిచ్చి కూతలు కూస్తుంది. మా దగ్గర అను బాంబులు ఉన్నాయి అంటూ ఇమ్రాన్ ఖాన్ పిచ్చోడి మాదిరిగా మాట్లాడుతున్నారు. దీనితో పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకిలా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: