నీటిలోంచి  అగ్గి జ్వాలలు ఎగసిపడ్డాయి. నీటిలో అగ్ని పుట్టడమేంటనేగా మెసందేహం. అక్కడికే వస్తున్నా.. కాస్త ఓపికపట్టండి మరి. నీటిలో అగ్ని చెలరేగడంతో ఓ  పడవ కాలి బూడిద అయింది. ఈ ఘటనలో నలుగురు మృత్యవాతకు గుర్తెరయ్యారు.ఈ దుర్ఘటన అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. అగ్ని కీలల్లో చిక్కుకున్న పడవలో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని శాంతాక్లాస్‌ ద్వీపానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.




ఆ ద్వేపంలో  39 మంది ప్రయాణికులతో కూడిన  ఓ పడవ ప్రయాణిస్తుంది. ఈ పడవలో సోమవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.ఆ సమయంలో ప్రయాణికులు నిద్రిస్తున్నారు. అదే సమయంలో  ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం కాగా 26 మంది ప్రయాణికులు గల్లంతయినట్టు సమాచారం. సహజంగా అగ్నిప్రమాదమంటే కర్మాగారాలు, గోదాములు అనుకుంటాం. కానీ మన ఊహకు అందని విధంగా అమెరికాలో ఏకంగా నీటిలో అగ్నిప్రమాదం జరిగింది.
 





రంగంలోకి దిగిన తీరగస్తీ దళాలు పడవలో నిద్రిస్తున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడారు. గల్లంతైన వారికోసం గాలింపులు చేపట్టారు. అగ్ని కీలల్లో చిక్కుకున్న పడవలో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న అమెజాన్ అడవుల్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అడవి సంపదను నష్టపోవాల్సివచ్చింది. పర్వత ప్రాంతాలు, అడవుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం సర్వసద్దారణమే. ఆయా ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు రోజుల తరబడి మంటలు ఎగసిపడిన సందర్భాలు లేకపోలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: