పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పట్టు సాధించడం కోసం ట్రై చేస్తున్నారు.  2019 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ పవన్ తన ఖాతాలో ఒక సీటు దక్కించుకొని పోరాటం చేస్తున్నారు. తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని చెప్పిన పవన్, చెప్పినట్టుగానే గెలిచేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాడు.  ఇప్పుడు పవన్ ముందున్న అతి పెద్ద సవాల్ గ్రామస్థాయిలో పట్టు సాధించడం.  పవన్ కళ్యాణ్ గ్రామ స్థాయిలో పట్టు సాధించాలి అంటే.. గ్రామాల్లో తప్పకుండా పర్యటించాలి. 


గ్రామాల్లో పర్యటించినపుడే పవన్ కళ్యాణ్ కు పట్టు దొరుకుతుంది.  గ్రామా స్థాయిలో నిర్మాణం బలంగా ఉండటం చాలా అవసరం.  కానీ, పవన్ ఇప్పుడు ఆ స్థాయిలో పనిచేస్తాడా అన్నది చూడాల్సిన అంశం.  గ్రామ స్థాయిలో వైకాపా, తెలుగుదేశం పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలను దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఏ రాజకీయ పార్టీకైనా కష్టమే అవుతుంది.  


గతంలో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలై ఉండొచ్చు.  కానీ, తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్తాయిలో బలం ఉన్నది.  క్షేత్ర స్థాయిలో బలం ఉన్నది.  వీరికి అక్కడ ఢీకొనడం అంటే ఇప్పట్లో పవన్ పార్టీకి సాధ్యం అవుతుందా అన్నది చూడాలి.  గత ఎన్నికల్లో పవన్ కు పట్టణ స్థాయిలోనే ఓట్లు పడ్డాయి.  గ్రామస్థాయిలో  ఓటింగ్ చాలా తక్కువ పడింది.  సో, పవన్ ముందు గ్రామాల్లో ఎక్కువగా పర్యటించి, అక్కడి సమస్యలను అర్ధం చేసుకొని వారికి అండగా నిలబడాలి.  


ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని కొన్ని గ్రామాలు తిరిగారు.  ఇప్పుడు తిరిగి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గ్రామాన్ని పవన్ తిరగాలి.  నాయకులను, కార్యకర్తలను తయారు చేసుకోవాలి.  అప్పుడే పవన్ కళ్యాణ్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడే అవకాశం ఉంటుంది.  అప్పుడే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పట్టు సాధించేందుకు మార్గం సుగమం అవుతుంది.  మరి పవన్ కళ్యాణ్ ఇలా చేయగలడా చూద్దాం.   


మరింత సమాచారం తెలుసుకోండి: