పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీ టీడీపీ 2 అంటూ విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ. ఎన్నికల ముందు నుంచీ ఇదే ప్రచారం జరిగింది. అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చేందుకే పవన్ ను చంద్రబాబు ప్రయోగించాడని వైసీపీ భావించింది. అందుకే జనసేనతో ఎన్నికల పొత్తుకు వైసీపీ ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ 2 లాగానే వ్యవహరిస్తున్నాడని వైసీపీ అంటోంది.


గతంలో పవన్ కల్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పోరాడాడు.. వారి కోసం అమెరికా నుంచి వైద్య నిపుణులను రప్పించాడు.. బాగానే ఉంది. వైసీపీ కూడా ఎన్నికల సమయంలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చింది. వారికి అధికారంలోకి వచ్చాక ఏకంగా నెలకు 10 వేల రూపాయల ఫించన్ ఇస్తోంది.


ఇప్పుడు ఏకంగా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం 50 కోట్ల రూపాయల నిధులతో ఓ పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇది నిజంగా మెచ్చుకోవాల్సి విషయం. గతంలో ఇదే సమస్య గురించి పోరాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య గురించి ఎక్కడా మాట్లాడడటం లేదు. కనీసం ఓ ప్రకటన కూడా చేయలేదు.


జనసేన టీడీపీ 2 పార్టీ అని చెప్పేందుకు దీన్నే ఉదాహరణగా చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు.. జగన్ వంద రోజుల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు, ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఇంటింటికీ పెన్షన్‌ పంపిస్తున్నారు. కిడ్నీ బాధితుల కోసం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. మరి పదే పదే కిడ్నీ బాధితుల గురించి మాట్లాడే పవన్‌ ఎందుకు ఇప్పుడు మాట్లాడడం లేదని వైసీపీ శ్రేణులు నిలదీస్తున్నాయి.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం వర్కులు, నామినేటెడ్‌ పదవులు, ఆశా వర్కర్లకు జీతాలు, స్పందన కార్యక్రమ రూపకల్పన, హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆదేశం. రివర్స్‌టెండరింగ్‌ చట్టం, తిత్లీ తుఫాన్‌ బాధితులకు పరిహారం, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ తక్కువ కాలంలోనే వైసీపీ తీసుకున్న చర్యలు అనేకం ఉన్నాయి. కానీ వీటి గురించి పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని.. ఆయన కేవలం టీడీపీ బినామీ అని ఆరోపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: