తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి మంగాయమ్మ 74 ఏళ్ల వయస్సులో రికార్డు సృష్టించింది. బామ్మ వయస్సులో పండంటి కవలలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది. మంగాయమ్మకు.. రాజారావుతో 1962లో పెళ్లయింది. ఇప్పుడు ఆమెకు 74 ఏళ్లు.. ఇటీవల ఆమెకు తెలిసిన ఒకావిడ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి అయ్యింది. ఈ విషయం తెలిసాక మంగమ్మకు తానూ తల్లిని కావాలనుకుంది.


గుంటూరులోని అహల్య నర్సింగ్‌ హోమ్‌ను సంప్రదించింది. వారు కృత్రిమ పద్దతుల్లో ఆమెకు గర్భధారణ చేయించారు. మంగాయమ్మకు బీపీ, షుగర్‌ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడం కలిసొచ్చింది. గురువారం వైద్యులు సిజేరియన్ చేసి కవల పిల్లలను బయటకు తీశారు. ఇద్దరు ముద్దులొలికే ఆడపిల్లలు.. ఆ బామ్మ ప్రపంచ రికార్డు సాధించింది..


గ్రేట్.. ఆ గుంటూరు వైద్యులు వైద్య చరిత్రలోనే అద్భుతం సృష్టించారు గ్రేట్.. కానీ.. ఇంతకీ ఆ బామ్మ చేసిన ఆ పని కరెక్టేనా..? ఇప్పుడు ఈ విషయంపైనా చర్చ జరుగుతోంది. ఇప్పుడు బామ్మకు 74 ఏళ్ల వయస్సు.. ఆమె భర్తకు కనీసం 80 ఏళ్లు ఉండే అవకాశం ఉంది. ఆ తాతగారు పిల్లలు పుట్టిన ఆనందంలో కనీసం కూర్చుని కూడా మాట్లాడలేకపోయారు.


మరి పుట్టిన ఈ ఇద్దరు పాపల భవిష్యత్ ఏమింటి.. వారి బాగోగులు చక్కగా చూసేదెవరు.. బంధువులు చూసినా కన్నపిల్లలంత బాగా చూస్తారా... అసలు ఈ వయస్సులో ఈ పని చేయమని వీరికి సలహా ఎవరు ఇచ్చారు.. ఇలాంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. చాలా మంది మంగాయమ్మ దంపతుల పనిని తప్పుబడుతున్నారు కూడా.


అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి.. పిల్లలు లేని బాధ అనుభవించే వారికి తెలుస్తుంది తప్ప.. వేరే వారికి కాదు..వారికి ఎంత తపన ఉంటే.. ఎంత మనసులో బాధ ఉంటే.. ఈ వయస్సులో ఈ సాహసానికి ఒడిగడతారు.. వారి కోణంలో ఆలోచిస్తే ఈ పని సబబే అనిపిస్తుంది.. మీరేమంటారు..?


మరింత సమాచారం తెలుసుకోండి: