ఎర్రమట్టి మంగాయమ్మ.. గురువారం టాక్ ఆఫ్ ద మీడియా అయ్యింది. ఆమె 74 ఏళ్ల వయస్సులో తల్లి కాబోతోందందని ఉదయమే పత్రికల ద్వారా తెలుసుకున్న టీవీ జర్నలిస్టులు గుంటూరులో అహల్య ఆసుపత్రి ముందు క్యూ కట్టారు. ఇక టీవీ జర్నలిజం అంటే ఎలా ఉంటుందో తెలుసుకదా.. అందులనూ 74 ఏళ్ల వయస్సులో తల్లి కావడం ప్రపంచ రికార్డు కూడా..


అయితే అసలు ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది.. ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సింది మంగాయమ్మ పట్టుదల. పిల్లలు కావాలన్న ఆమె తపనే ఆమెకు అంత శక్తని ఇచ్చింది. 74 ఏళ్లు అంటే తక్కువ వయస్సేమీ కాదు.. అప్పటికే మునిమనవలను చూడాల్సిన వయస్సు.. అయినా ఆ వయస్సులో తల్లి అయ్యేందుకు ఆమె తపించింది. అందుకు ఆమె చేసిన సాహసం అంతా ఇంతా కాదు..


దాదాపు ఏడాది ముందు నుంచే మంగాయమ్మ గుంటూరులోని అహల్య ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. కాన్పు అయ్యేవరకూ ఆసుపత్రి వదిలి వెళ్లకూడదని చెప్పారు.74 ఏళ్ల వయస్సులో ఏడాదిపాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి రావడం మామూలు విషయం కాదు. కానీ మంగాయమ్మ అందుకు తాను సిద్ధం అన్నారు.


అదృష్టం ఏమిటంటే.. ఆమె ఆరోగ్యం చాలా బావుంది. 74 ఏళ్ల వయస్సులోనూ సుగర్, బీపీ వంటి సమస్యలు కూడా లేవు. అందుకే వైద్యుల పని కాస్త సులభం అయ్యింది. ఐవీఎఫ్ పద్దతి ద్వారా ఆమెకు గర్బం రప్పించారు. అదృష్టం ఏంటంటే.. ఆమెకు మొదటి సైకిల్ లోనే గర్భం వచ్చేసింది. గర్భం రావడం ఒక ఎత్తు.. దాన్ని జాగ్రత్తగా నిలపడం మరో ఎత్తు.


గుంటూరు అహల్య ఆసుపత్రి వైద్యులు కాడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. నెలలు నిండే కొద్ది మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు పది మంది వైద్యులు ఓ బృందంగా ఏర్పడి ఆమెను కంటికి రెప్పలా కాచుకున్నారు. ఇది ప్రపంచ రికార్డు కేసు కాబట్టి వైద్యులు కూడా ఛాలెంజింగ్ తీసుకున్నారు. మంగాయమ్మ సిజేరియన్ తర్వాత కూడా మీడియాతో హుషారుగానే మాట్లాడటం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: