ఏపీ సీఎంగా జగన్ 100 రోజులు పూర్తి చేసుకున్నారు. మరి ఈ 100 రోజుల పాలన ఎలా సాగింది. ప్రజలు ఏమనుకుంటున్నారు.. ఏ ఏ అంశాల్లో ఎలాంటి వైఖరి తీసుకున్నారు. జగన్ తీరు రాష్ట్రానికి లాభమా.. నష్టమా అన్న కోణంలో దమ్మున్న పత్రికగా చెప్పుకునే ఓ పత్రిక విశ్లేషణాత్మక, సంచలన కథనం ప్రచురించింది. సాధారణంగా జగన్ అంటేనే నెగిటివ్ కోణం చూపడంతో ఈ పత్రిక ఆసక్తి చూపుతుందని పేరుంది.


తాజాగా ఈ కథనం కూడా అదే తీరులో ఉంది. ముఖ్యాంశాలు ఏమింటంటే.. జగన్ పాలన విభిన్నంగా సాగుతోందని ఈ పత్రిక అభిప్రాయపడింది. వంద రోజుల ప్రయాణంపై మిశ్రమ స్పందన వ్యక్తమైందంటోంది. చెప్పిందే చేయాలన్నది ముఖ్యమంత్రి వైఖరి ఇబ్బందులకు కారణమవుతోందట. అధికారుల ఉత్సాహం కొన్నాళ్లకే ఆవిరి అయిపోయిందట. ప్రజా వేదిక కూల్చివేతను జనం మెచ్చలేదట. ఇసుక జాప్యం ప్రజలకు చుక్కలు చూపించిందట.


ఇక ‘రివర్స్‌’ నిర్ణయాలతో అమరావతి, పోలవరం ఆగిపోయాయని.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళికలపై అస్పష్టత నెలకొందని ఈ పత్రిక అభిప్రాయపడింది. ప్రజా వేదిక కూల్చివేత, అన్న క్యాంటీన్ల మూసివేత, మూడు నెలలకు పైగా ఇసుక అందుబాటులో లేకపోవడం, తెల్లరేషన్‌ కార్డుదారులకు కేవైసీ తిప్పలు వంటి అంశాలు జగన్ 100 రోజుల పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టాయని.. వీటిని జనం మెచ్చలేదని ఈ పత్రిక అభిప్రాయపడింది.


ఇక గ్రామ, వార్డు వలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రభుత్వంలోకి ఆర్టీసీ సిబ్బంది విలీనం, ప్రభుత్వం ద్వారా మద్యం విక్రయం వంటి సంచలన నిర్ణయాలను జగన్ ఈ 100 రోజుల్లో తీసుకున్నారని ఈ పత్రిక అభిప్రాయపడింది. జగన్ 100 రోజుల పాలనలో వివాదాస్పదమై అంశాలను కూడా ఈ పత్రిక లిస్ట్ అవుట్ చేసింది. అవేంటంటే.. పోలవరం సహా కీలక ప్రాజెక్టుల రివర్స్‌ టెండరింగ్‌, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల సమీక్ష, ‘అమరావతి’పై అయోమయం సృష్టించడం, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన వాటి సంగతి తేల్చకుండానే... హైదరాబాద్‌లోని భవనాల అప్పగించడం.. ఇదీ స్థూలంగా జగన్ 100 రోజుల పాలనపై ఆ పత్రిక విశ్లేషణ.


మరింత సమాచారం తెలుసుకోండి: