కొత్త ప్రభుత్వం రాజన్న రాజ్యం తీసుకొస్తుందని అనుకుంటే రాక్షస రాజ్యం తీసుకువచ్చారని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ బాబు తీవ్రంగా దుయ్యబట్టారు. ఏమి తప్పుచేయకపోయినా అక్రమ కేసులు పెట్టి అమాయకులను ఇబ్బందులు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కులమతాలకు అతీతంగా టీడీపీకి ఓటు వేసిన ప్రతీ ఒక్కరని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇంత చెస్తున్న  100 రోజుల సహనంగా, ఓపిక పట్టి ఉన్నామని చెప్పారు. ఇంకా సహించేది లేదన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏవిధంగా కార్యకర్తలను చంపారో..నేడు జగన్ కూడా అదే విధంగా కార్యకర్తలను బలితీసుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు.





ఎవరెన్ని ఇబ్బందులు పెట్టిన బాధితులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. బాధితులు కోసం శిబిరాన్ని ప్రారంభించి 4 రోజులైనా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని విమర్శించారు. బాధిత కుటుంబానికి 10 వేల చొప్పున ఆర్థిక సాయంతో పాటుగా వారి పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తామన్నారు. పిన్నెలి గ్రామంలో 200 మంది పై ఒక్కక్కరి పై 4 అక్రమ కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉందా అని లోకేష్ ప్రశ్నించారు.  ఈ నెల 11 నాటికి గ్రామాల నుండి వెళ్లిన వారికి రక్షణ కల్పించి తిరిగి గ్రామలలోకి తీసుకురావాలన్నారు.లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. గురజాల ఎమ్మెల్యే భూమి మీద నిలవడం లేదని విమర్శించారు. 11 ఏళ్ల బాలుడిని కొట్టడం దుర్మార్గమన్నారు. 





వైకాపా నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.  పశ్చిమ నియోజకవర్గం అరండల్ పేట 2వ లైన్ లో ఉన్న గుంటూరు డిస్ట్రిక్ వైన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఉన్న టీడీపీ ఆధ్వర్యంల వైసీపీ ప్రభుత్వ బాధితుల పునరావాస శిబిరంలో బాధితులను  లోకేష్ పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు ,జిల్లా టీడీపీ అధ్యక్షులు జివి.ఆంజనేయులు,ఎమ్మెల్సీ లు డొక్కా మాణిక్య వరప్రసాద్, అశోక్ బాబు పాల్గొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: