టీవీ9.. తెలుగులో నెంబర్ వన్ న్యూస్ ఛానల్.. అందులో సందేహం లేదు. ఎలాంటి వార్తనైనా ఇంట్రస్టింగ్ గా.. కాస్త సంచలనాత్మకంగా చెప్పాలంటే ఇప్పటికీ టీవీ9 దే పైచేయి. కాకపోతే అప్పుడప్పుడు ఈ ఛానల్ చేసే హడావిడి నెగిటివ్ అవుతుంటుంది. ప్రతిదీ సంచలనాత్మకం చేయాలనే ధోరణి.. రేటింగ్స్ కోసం చేసే హంగామా ఈ చానల్ అంటే ప్రేక్షకుల్లో నెగిటివ్ ఒపీనియన్ కు కారణమవుతుంటుంది.


తాజాగా చంద్రయాన్ 2 విషయంలోనూ అదే జరిగింది. ఎలాగూ చంద్రుని మీదకు మన రోవర్ దిగుతుంది కదా.. అన్న ధీమాతో ఈ ఛానల్ కాస్త ఓవర్ క్రియేటివిటీ ప్రదర్శించింది. ఈ అంశంపై నిర్వహించే డిబేట్ కోసం వెరైటీ బ్యాక్ గ్రౌండ్ తయారు చేయించింది. అదేంటంటే.. చంద్రునిపై కూర్చుని గెస్టులు ఈ అంశంపై డిస్కస్ చేస్తున్న బీజీ రూపొందించింది.


మామూలుగా అయితే చంద్రయాన్ 2 సక్సస్ అయ్యి ఉంటే.. ఈ బీజీ బాగానే ఉండేది.. ఆ సంతోషంలో కాస్త క్రియేటివిటీ ఎక్కువైందిలే అనుకునే వారే.. కానీ చివరి నిమిషంలో చంద్రయాన్ 2 నుంచి సిగ్నల్స్ అందకపోవడంతో యావత్ భారతం నిరాశలో ఉంది. అంత కష్టపడిన ప్రయోగం చివరి నిమిషంలో ఇలా అయ్యిందేంటా అన్న బాధ దేశాన్ని ఆవరించింది.


ఏకంగా ఇస్రో చైర్మనే భోరున విలపించేశారు. ఇలాంటి సమయంలో టీవీ 9 బీజీ చూసిన వాళ్లకు ఒళ్లు మండుకొచ్చింది. చంద్రుని కంటే ముందే వీళ్లు చంద్రునిపై ల్యాండయ్యారన్న అర్థం వచ్చేసింది. దీంతో ఈ ఆ వీడియోలను, ఇమేజ్ లను షేర్ చేస్తూ... చంద్రయాన్ కంటే ముందే ల్యాండ్ అయిన దిక్కుమాలిన టీవీ9 వాళ్లు.. వీళ్లు ఈ జన్మకు మారరు.. అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గతంలోనూ టీవీ9 ఛానల్ అనేక సార్లు ఇలాంటి జిమ్మిక్కులు చేయడంతో ఆ ప్రభావం ఈ ట్రోలింగ్ పైనా పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: