ఏపీ సీఎంగా జగన్ వంద రోజుల పాలనలోనే నిరుద్యోగులకు ఊరట నిచ్చారు. ఏకంగా లక్షల సంఖ్యలో ఉద్యోగవకాశాలు కల్పించారు. అదీ ప్రభుత్వ రంగంలో.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి రెండున్నర లక్షల వరకూ ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా కూడా లక్షన్నర వరకూ ఉద్యోగ నియామకాల ప్రక్రియ సాగుతోంది. ఇవి కాక.. టీచర్ల ఉద్యోగాలకు కూడా కసరత్తు జరుగుతోంది.


ఈ సమయంలో జగన్ మరో తీపికబురు చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... మనం వేసే ప్రతి అడుగు కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే. కరెక్టుగా అడుగులు వేయగలిగితే ఈ సమస్యను తగ్గించగలుగుతాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంగా గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేశాం. 50 ఇళ్లకు ఒక్కరిని నియమించి, నెలకు రూ.5 వేలు అందిస్తున్నామన్నారు జగన్.


మూడేళ్ల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామని చెప్పడానికి గర్వపడుతున్నా. అన్నింటికన్న విప్లవాత్మక మార్పు ఏంటంటే ..స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు అన్న చట్టం తెచ్చాం. దేశంలో మనమే ఇలాంటి చట్టం చేశాం. చదువులు పూర్తి అయిన తరువాత పిల్లలు ఉద్యోగాల కోసం వలస వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితి మార్చేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసింది. ఇందులో సవాల్స్‌ కూడా ఉన్నాయి. మనకు ఉన్న స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ చేసుకోవాలి. మనం చదివే ప్రతి కోర్స్‌లు కూడా జాబ్‌ ఓరియేంటెడ్‌ కోర్స్‌గా ఉండాలన్నారు జగన్.


రాబోయే రోజుల్లో ఈ సిఫార్సులు అన్ని కూడా ఇంఫ్లిమెంట్‌ అయ్యేలా చేస్తాం. క్వాలిటీ ఆఫ్‌ ఎండ్యుకేషన్‌ అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతాయన్న నమ్మకంతో ఉన్నాను. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తాం. ఉద్యోగాల నియామకానికి శ్రీకారం చుడతాం అని జగన్ భరోసా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: