పాలనలో దూసుకుపోతున్న వైఎస్ జగన్ సర్కారు ఓ విషయంలో మాత్రం వెనుకబడింది. వాణిజ్య పన్ను వసూళ్లలో టార్గెట్ అందుకోవడంలో కొంత విఫలమైంది. ఈ విషయాన్ని వాణిజ్య పన్నులు శాఖ అధికారులు తో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ స్వామి తాజాగా వెల్లడించారు.


ఆగష్టు నెల వరకు 22,464.42 కోట్లు లక్ష్యంగా ఉండగా.. 18,859 కోట్లు రీచ్ అయ్యామని ఆయన వివరించారు. అధికారులు సిబ్బంది బాగా పని చేస్తున్నారని.. టార్గెట్ రీచ్ అవుతారని‌ భావిస్తున్నామని నారాణయణ స్వామి ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ 2, వైజాగ్, ఏలూరు, కర్నూలు ప్రాంతాలలో 91శాతం టార్గెట్ రీచ్ అయ్యారు.. కడప, విజయవాడ1, గుంటూరు బాగా వెనుకబడ్డాయని వివరించారు.


కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో వివిధ అంశాల పై చర్చించిన నారాయణస్వామి.. రిటర్న్ ఫైల్స్ అనేది ఎంత వరకు చేస్తున్నారో కూడా రివ్యూ చేశామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని.. ఫిజికల్ వెరిఫికేషన్ చేసి.. అనుమతులు ఇస్తే బోగస్ సంస్థలు ఉండవని అధికారులకు తెలిపారు. ఎక్కడా కూడా ఇబ్బందులు పెట్టకుండా పాత బకాయిల కోసం ఒన్ టైం సెటిల్మెంట్ చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఐదు వేల కోట్లకు సంబంధించిన కోర్టు కేసులు ఉన్నాయని.. వాటి గురించి న్యాయ నిపుణులు తో చర్చిస్తామని నారాయణ స్వామి అన్నారు. నాటు సారాను పూర్తి గా అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. ఇంతవరకు కాపు సారా కాసే లేబర్ పైనే కేసులు పెట్టేవారు.. ఇప్పుడు మా ప్రభుత్వం నిర్వాహకుల పై కేసులు నమోదు చేస్తుంది.. అని మంత్రి తెలిపారు.


గతంలో చంద్రబాబు కు నేను లేఖ రాసినా పట్టించుకోలేదు.. నాటు సారా అరికట్టడంలో సిఎం జగన్ సఫలం అయ్యారు.. జగన్ కు పేరు వస్తుందనే అక్కసుతో ప్రతిపక్షం రాజకీయ కోణంలో చూడొద్దు.. పత్రికలు, మీడియా కూడా మద్యపాన నిషేధం‌ పై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వానికి సహకారం అందించాలి.. ప్రభుత్వ పరంగా నిజంగా తప్పులు ఉంటే రాసుకోండి.. మద్యం లేని రాష్ట్రం గా ఎపి ని తీర్చిదిద్దాలనే లక్ష్యం తో సిఎం పని చేస్తున్నారు.. మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాలను పాఠ్యాంశాలలో పొందు పరుస్తాం.. గత ప్రభుత్వం కేవలం ఆదాయమే లక్ష్యం గా పని చేసింది.. మాది ప్రజల ప్రభుత్వం.. మాకు ఆదాయం కన్నా సంక్షేమం ముఖ్యం.. అటూ జగన్ సర్కారు ప్రాధామ్యాలని వివరించారు మంత్రి నారాయణ స్వామి.


మరింత సమాచారం తెలుసుకోండి: