సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై టీడీపీ అప్పుడే జోరుగా విమర్శల ప్రచారం సాగిస్తోంది. అది ఎంత వరకూ వెళ్లిందంటే.. చివరకు పెయిడ్ ఆర్టిస్టులతో ముఖ్యమంత్రిని తిట్టించడం, ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేయడం, అబద్ధపు వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేయించడం వరకూ వెళ్లిందని వైసీపీ నేతలు అంటున్నారు.


టీడీపీ సోషల్ మీడియా తీరుపై వైసీపీ మండిపడుతోంది. కుల, ప్రాంత, మత ఘర్షణలు చెలరేగేలా వాఖ్యలు చేయడం, చేయించడం, టీడీపీ నేతలతో వివక్షాపూరితంగా దాడులు చేయించడం, గ్రామాల్లో జరిగే సాధారణ గొడవలకు రాజకీయ రంగు పులిమి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, కుల పత్రికలతో కుట్రపూరితంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయించడం ఇవేనా 40ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.


టీడీపీ సోషల్ మీడియా ప్రచారకర్తలు తిరుపతి కొండను, శ్రీవారిని కూడా తన నీచ రాజకీయాలకు పావుగా వాడుకుంటున్నారు. అయితే అటు ప్రభుత్వం, ఇటు సోషల్ మీడియా చంద్రబాబు అబద్ధాలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూనే ఉంది. అయినా కూడా వైయస్ జగన్ ప్రభుత్వంపై దుష్ర్పచారం చేయడం, ముఖ్యమంత్రిని కించపరచడం విషయంలో రోజుకో కొత్త పంథా అనుసరిస్తున్నారు.


ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ప్రజల్లో వ్యతిరేకత పుట్టించాలన్న పచ్చనేతల ప్లాన్లు అంతగా సక్సస్ అవడం లేదు. ట్విట్టర్లో చంద్రబాబు, లోకేష్, ఇంకా లక్షల జీతాలిస్తూ నియమించుకున్న టీడీపీ సోషల్ మీడియా ఉద్యోగులు కలిసి ప్రస్తుతం చేస్తున్న ఒకే ఒక్కపని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పైనా, ముఖ్యమంత్రి పైనా తప్పుడు ప్రచారం చేయడం. అయితే ఈ ప్రచారం పూర్తిగా ఫెయిలైందని చెప్పలేం.. కాకపోతే.. ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ఫోకస్ చేసి ఉంటే.. ఈ ప్రచారానికి క్రెడిబిలిటీ వచ్చేది.. ప్రతి విషయాన్ని విమర్శించడం వల్ల టీడీపీ సోషల్ ప్రచారం.. ఆ పార్టీ వారికి మాత్రమే నచ్చుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: