ఆసియా దేశాల సాంప్రదాయాలలో ఏనుగులు పండుగనాడు శుభసూచకంగా ఆరాధింపబడుతున్నాయి. కానీ అప్పుడప్పుడు అనుకోని కారణాలతో ఏనుగులకు పట్టరాని కోపం వచ్చి చుట్టూ ఉన్న వారినందరిని చంపివేసే ప్రయత్నం చేస్తుంది. అదే అడవిలో ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్లను మరియు చెట్లను పీకి పారేస్తుంది. తాజాగా శ్రీలంకలో కూడా ఇటువంటి దుర్ఘటన జరిగింది. గుడి చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశంలో ఏనుగులు బీభత్సం సృష్టించి ప్రాణ నష్టాన్ని కలిగించాయి.

దీనికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఏనుగు పండుగ కోసం తయారు చేశారట. తయారీ లో భాగంగా మొహానికి ఒక వస్త్రాన్ని, మరియు కాళ్లను కట్టి వేస్తూ సంకెళ్లను, నడవడానికి కూడా వీలు లేకుండా ఉండే అంతగా భారీ ఆభరణాలు వేసి వెలుగు జిలుగుల మధ్య ధ్వనుల మధ్య పెట్టారట. ఇక అంత బాధలో ఉన్న జీవికి మంచిచెడుల ఆలోచన ఏముంటుంది.

కొట్టె రాజ మహా విహార ఆలయంలో శనివారం రాత్రి నాడు జరిగే పండుగ సంబరాలలో ఈ దుర్ఘటన జరిగింది. పెరహెరా ఫెస్టివల్  జరిగిన ప్రతి ఏడాది కూడా ఈ 70 ఏళ్ళ ఆడవి ఏనుగును ఎన్ని కిలోమీటర్లు నడిపించుకుంటూ తీసుకువెళ్తారు అట. ఇది చాలా అమానుషం అని చెప్పి ఆ వయసు ఏనుగును కూడా ఇలా బాధ పెట్టడం సరికాదు అని అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి.

మన సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్కసారి ఏనుగు లేదా ఆవు వంటి పశువులను పూజ కోసం లేదా పండుగ సాంప్రదాయం కోసం మన చుట్టూ ఉంచుకుంటాము. కానీ అది వాటి ప్రాణాలను సైతం తీసే అంత ఇబ్బందికరంగా ఉండటం మానవులకు సరి అయినది కాదు. మానవత్వమే నశించినప్పుడు ఇక దైవత్వం ఎలా ఆవలంభించుకుంటాము? ఇటువంటి పూజలు చేసి ఉపయోగం ఏంటి అనే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: