ఈ ఏడాది  సెప్టెంబర్ 1 నుంచి మోటార్ వాహనాల సవరణ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం అమలుకు కొన్ని రాష్ట్రాలు విముఖత వ్యక్తం చేసినప్పటికీ.. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే  అమలు చేస్తున్నాయి. దీనితో  ఈ చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో మారిన నిబంధనల ప్రకారం వాహనదారులకు భారీగా చలాన్లు విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలని  తగ్గించేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ... భారీ ఫైన్లతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. నేషనల్, రాష్ట్రాల హైవేల్లో ప్రమాదాల్ని తగ్గించేందుకు రూ.26వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఇంత డబ్బును రాబట్టేందుకు ఫైన్లు కూడా భారీగా వేశారు. 

ఇప్పుడున్న ఫైన్లను ఐదు నుంచీ 10 రెట్లు పెంచారు. హెల్మెట్ లేకపోతే రూ.1000, మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేల జరిమానా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ టూవీలర్ యజమానికి ఏకంగా రూ.23 వేలు ఫైన్ వేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే దేశంలోని చాలామంది కొత్త రూల్స్ తెలియక భారీగా పడిన ఫైన్స్ ఎలా కట్టాలో అని ఆలోచిస్తున్నారు. ఇకపోతే తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

కొత్త వెహికల్స్ చట్టం ప్రకారం ఒడిశాకు చెందిన ఓ ట్రక్ డ్రైవర్‌కు అధికారులు రూ. 86,500ల జరిమానా విధించారు. దేశంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తరువాత విధించిన జరిమానాల్లో ఇదే అత్యధికమని తెలుస్తుంది. వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు అశోక్ కుమార్ అనే ట్రక్ డ్రైవర్‌పై ఈ మొత్తం జరిమానాగా విధించారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు రూ. 5000, పరిమితికి మించి సరుకు తరలిస్తున్నందుకు రూ. 56000, ఇతర ఉల్లంఘనల కింద రూ. 25500 ఫైన్ విధించారు. కాగా అంత పెద్ద మొత్తం ఇచ్చకోలేనని ట్రక్ డైవర్ అధికారులను వేడుకోకున్నాడు. దాదాపు 5 గంటల పాటు ట్రక్ డైవర్‌కు, పోలీసులకు మధ్య జరిగిన తర్జనభర్జనల అనంతరం అధికారులు జరిమానాను 70,000వేలకు కుదించారు. ఇందుకు సంబంధించిన బిల్లులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ఈ కొత్త చట్టంతో దేశ ప్రజలు వాహనాల్ని బయటకి తీసుకురావాలి అంటే బయటపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: