ప్రపంచంలో దేవుడి తర్వాత అంత గొప్ప స్థానం ఇచ్చింది అమ్మకు మాత్రమే.  నవమోసాలు కనీ పెంచి తమ సంతానం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దంగా ఉంటుంది మాతృమూర్తి. అయితే స్గ్రీకి మతృత్వం ఎంతో గొప్ప వరమో బిడ్డను కనడం కూడా అంతే అగ్ని పరీక్ష.  అందుకే పురిటినొప్పులు అనగానే తల్లీ పిల్లా క్షేమంగా ఉండాలని మొక్కుంటారు. అయితే కొంత మందికి మాత్రం కొన్ని అనారోగ్య కారణాల వల్లనో..వంశపార్యంపర కారణాల వల్లో మాతృత్వానికి నోచుకోరు. అయితే ఈ మద్య సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొంతమంది కృత్రిమ గర్భంతో తల్లులు అవుతున్న విషయం తెలిసిందే. 

తాజాగా ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై సార్లు గర్భవతి అయ్యిందట. లంకాబాయి ఇప్పటి వరకు 16సార్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రసవించింది. మూడుసార్లు గర్భస్రావం అయింది. ఐదుసార్లు మాత్రం పుట్టిన పిల్లలు కొన్ని గంటల వ్యవధిలో మృతి చెందారు. ఇలా ఎందుకు అవుతున్నారో ఆమెకు అస్సలు బోధపడటం లేదనట. పరీక్షల కోసం తాజాగా ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు షాకయ్యారు. ఆమె 20వ సారి గర్భం దాల్చినట్టు తెలుసుకుని నోరెళ్లబెట్టారు.

ప్రస్తుతం ఆమెకు 11 మంది పిల్లలున్నారు. లంకాబాయి విషయం తెలిసిన బీడ్ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ థొరాట్ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేశారు.లంకాబాయి  ఇన్నిసార్లు గర్భం ధరించడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవమయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భంతో ఉందని, తల్లి, గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. అయితే దేశంలో ఒక్కరు ముద్దు..ఇద్దరు వద్దు అనే నినాదాలు వినిపిస్తున్న తరుణంలో లంకాబాయిలాంటి వాళ్లు ఇంకెంత మంది ఉన్నారో అని చెవులు కొరుక్కుంటున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: