ఇటు టీడీపీ అటు వైసిపి నేతలు గుంటూరులో మకాం వేశారు . అధికారంలోకి వచ్చాక వైసిపి దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులతో టిడిపి రాజకీయం చేస్తోందని వైసిపి ఆరోపిస్తోంది. ఇటు గుంటూరు శిబిరంలో ఉన్న వారిని ఒప్పించి గ్రామాలకు తీసుకువెళ్లాలని టిడిపి భావిస్తోంది . కాసేపట్లో టిడిపి అధినేత చంద్రబాబు శిబిరానికి రానున్నారని తెలుస్తోంది. ఛలో ఆత్మకూరు పిలుపు నేపథ్యంలో గుంటూరులో హైటెన్షన్ కొనసాగుతోంది, పోలీసులు భారీ ఎత్తున మొహరించారు .


ఛలో ఆత్మకూరు పిలుపుని విరమింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, గుంటూరులో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే పల్నాడులో తాజా పరిస్థితులపై టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు . గుంటూరులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన ఈ భేటీకి కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, అఖిలప్రియా, అశోక్ బాబు, గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని ప్రభుత్వం భద్రత కల్పించటంలో విఫలమవుతోందని ఆరోపిస్తున్నారు టిడిపి నేతలు .


ఇదిలా వుంటే శిబిరం పేరుతో టిడిపి నాటకమాడుతోందని ఆరోపిస్తున్నారు వైసిపి నేతలు . అధికారంలో ఉన్నపుడు జరిగిన అవినీతి కేసులపై ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు ఈ కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపిస్తున్నారు . అధికారంలో ఉన్నపుడు మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే యరపతినేని అవినీతికి పాల్పడ్డారని అది బయటికి రాకుండా బాధితుల శిబిరంతో ప్రజల దృష్టి మరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు . ముమ్మాటికీ టిడిపి శిబిరంలో ఉన్నదంతా పెయిడ్ ఆర్టిస్టులే అని చెప్పుకొస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  .


మరింత సమాచారం తెలుసుకోండి: