సెప్టెంబర్ 17, 1948.. తెలంగాణ గడ్డకు స్వతంత్ర్యం వచ్చిన రోజు ఇది.. మిగిలిన భారతావనికి 1947 ఆగస్ట్ 15 నే స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు మాత్రం రాలేదు. తెలంగాణతో పాటు మరికొన్ని స్వదేశీ సంస్థాలకు స్వంతంత్ర్యం రాలేదు. అప్పటికీ తెలంగాణ నిజాం రాజుల పలనలో ఉంది. దేశానికి స్వంతంత్యం వచ్చిన వేళ నిజాం రాజు.. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏం చేయాలో నిర్ణయించుకోలేదు.


హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో కలిపే ఆలోచన చేసినా కుదరలేదు. ఇండియాలో కలిపేందుకు మనసు రాలేదు..ఈ సమయంలో తెలంగాణ సాయుధ పోరాటం ఓవైపు.. భారత సైన్యం ఓవైపు నిజాం ను ఉక్కిరిబిక్కిరి చేయగా.. చివరకు సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ రాజ్యాన్ని భారత్ లో విలీనం చేశారు. దీన్ని విమోచనం అని కొందరు అంటే.. విలీనం అని మరికొందరు అంటారు.


అయితే తెలంగాణ వచ్చాక ఈ సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించడం లేదు. దీనిపై బీజేపీ వంటి పార్టీలు మండిపడుతున్నాయి. మళ్లీ సెప్టెంబర్ 17 దగ్గర పడటంతో మరోసారి విమర్శలు వస్తున్నాయి. ఈసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ఇష్యూపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం చేతిలో టీఆర్ఎస్ బందీగా మారిందని దుయ్యబట్టారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందని మండిపడ్డారు.


ఉద్యమ సమయంలో చెప్పిన అంశాలను కేసీఆర్ మరచిపోయారని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు భయపడుతున్నారని విమర్శించారు. ఎంఐఎం చేతిలో తెలంగాణ సీఎం కీలుబొమ్మలా మారారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన తమ్ముడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అంటే కేసీఆర్‌కు భయమని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్ బీరాలు పలికారని కిష్ రెడ్డి గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: