ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో అమరావతి విషయంలో ప్రజలకు చాలా సినిమాలు చూపించారు. గ్రాఫిక్స్ తో అరచేతిలో వైకుంఠం చూపించారు. ఆ బిల్డింగులు, ఆ ఆకాశహర్మ్యాలు, ఆ రోడ్లు గ్రాఫిక్స్ లో చూసి జనం అహో అమరావతి..ఆహా అమరావతి అనుకున్నారు. కానీ అవన్నీ పేపర్లపైనే ఉండిపోయాయి. వాటిలో కొంత వరకూ పనులు జరిగింది.. తాత్కాలిక భవనాలు.. రోడ్ల విషయంలోనే..


తాత్కాలిక భవనాలను అర్జంట్‌ ప్రాతిపదికపైన.. చదరపు అడుక్కి రికార్డు ధరకు కొన్ని కంపెనీలకే కట్టబెట్టారు. అంత చేసినా ఆ భవనాలు వానాకాలంలో కురుస్తూ ఎంత అవినీతి జరిగిందో చెప్పకనే చెబుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఇక ఇప్పుడు రోడ్ల వంతు వచ్చింది. అమరావతి రాజదాని రోడ్డు పనులలోనూ భారీగా అవినీతి జరిగిందని గతంలోనే ఆరోపణలు వచ్చాయి.


ఇప్పుడు అవి ఆరోపణలు కాదు.. వాస్తవాలే అని తెలుస్తోంది. రాజధాని రోడ్ల విషయంలో 751 కోట్ల దోపిడీ జరిగిందని విజిలెన్స్ విబాగం నిర్దారించినట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగు రోడ్ల నిర్మాణాన్ని నాలుగు వేల కోట్లతో చేపట్టారు. అయితే వాటిని ముందుగా ఎంపిక చేసుకున్న కాంట్రాక్టర్ లకే అప్పగించారని విజిలెన్స్ నిగ్గు తేల్చిందని తెలుస్తోంది. అంతే కాదు.. ముందే చాలా ఎక్కువ రేటుకు పనులు అప్పగించారు.


అంతే కాదు.. ఆ తర్వాత కూడా ఆ అంచనాలను భారీగా పెంచేశారు. మొత్తం మీద ఈ అమరావతి రోడ్ల విషయంలో 750 కోట్ల అవినీతి జరిగిందని తెలుస్తోంది. ఈ మేరకు విజిలెన్స్ డిపార్ట్ మెంట్ రిపోర్టు తయారు చేసిందట. అమరావతిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని గత కొద్ది సంవత్సరాలుగా వస్తున్న ఆరోపణలకు ఈ నివేదిక సపోర్ట్ చేస్తుందన్నమాట. మరి ఈ నివేదిక మొత్తం బయటకు వస్తే ఇంకెన్ని సంచలనాలు వెలుగు చూస్తాయో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: