బయటకు వెళ్ళి ఏమైనా తినాలన్నా,తాగాలన్నా రేట్లు మండిపోతున్న ఈ కాలంలో నిస్వార్ధంగా సేవచేసే వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.ఇక ఏదైనా బిజినెస్ చేసే వారు లాభ నష్టాలను చూసుకుని వ్యాపారం చేస్తారు.కాని నిజాయుతీగా తనకు తోచినంతలో నలుగురికి సహాయపడుదామని ఆలోచించే వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.నాకేంటీ లాభం అని ఆలోచించే మనుషులున్న ఈ కాలంలో 80 ఏళ్ల వయస్సులో కుడా నలుగురికి తోచినంతగా సహాయం చేస్తూ, అదికూడా 30 సంవత్సరాలనుండి ఎటువంటి లాభాపేక్ష లేకుండా వున్న ఈ బామ్మ గురించి మనలో ఎంతమందికి తెలుసు.ఈమె దగ్గర ఇడ్లీ కేవలం ఒక్క రూపాయికి ప్లేట్ మాత్రమే ఇలాంటి సేవ ఇంకెక్కడైన,ఎవరైనా చేస్తున్నారా.అంతే కాకుండా ఈ కాలంలో రూపాయికి ఎవరు విలువిస్తున్నారు..అందుకే ఈ బామ్మను చాలమంది ఎప్పటికి మరవకుండా గుర్తు పెట్తుకుంటారు.



ఈమె పేదల పాలిట అన్నపూర్ణమ్మ,ఆకలితో వున్న వాళ్లకి అమ్మ.ఇలాంటి వాళ్లను ఏ బిరుదుతో సత్కరించిన తక్కువే.పేదలకు అది చేసాం,ఇది చేసాం అని చెప్పుకునే నాయకులున్న ఈ కాలంలో ఏ పబ్లిసిటి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళుతున్న ఈ బామ్మగారి లైఫ్‌స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. తమిళనాడులోని వడివేలంపాల్యంలో నివసిస్తున్న కె.కమలతాల్ 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది.80 ఏళ్ల వయస్సులోనూ ఉదయాన్నే నిద్రలేచి,పిండి రుబ్బి ఇడ్లీల తయారీలో నిమగ్నమయ్యే ఈ బామ్మ నిజంగా ఎందరికో ఆదర్శం.ఈ విషయం ఆశ్చర్యానికి గురిచేసే అద్భుత గాథల్లో,ఇది కూడా ఒకటి గా చెప్పవచ్చు.ఇక ఈ బామ్మ చేస్తున్నసేవ సమాచారం మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రకు కూడా తెలిసింది.



ముదిమి వయస్సులోనూ కష్టపడి వ్యాపారం చేస్తున్న ఆ బామ్మగారిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు.కట్టెల పొయ్యిపైనే ఇడ్లీలు వేస్తున్న ఆమెకు సాయం చేయడానికి ముందు కొచ్చారు.ఈ సందర్భంగా ఆయన కమలతాల్ వంటి వారికి కొంత సాయం చేసినా,ఎంతో మందికి మంచి జరుగుతోంది. ఆ బామ్మ ఇప్పటికీ కట్టెల పొయ్యే వాడుతున్నారు.మీకు ఎవరికైనా ఆమె తెలిస్తే నాకుచెప్పండి.నేను ఆమెవ్యాపారంలో పెట్టుబడి పెడతా.గ్యాస్ స్టవ్ కొనిస్తా అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.ఇక ఆనంద్ మహీంద్ర ట్వీట్‌పై‘ఇండియన్ ఆయిల్’సంస్థ కూడా స్పందించింది.‘సరిగ్గా చెప్పారు.ఇండియన్ ఆయిల్ దేశానికి ఏ స్ఫూర్తితో సేవలను అందిస్తుందో..ఆమె కూడా ఆవిధంగానే సమాజ సేవ చేస్తోంది.అలాంటి వారికి మా మద్దతు ఉంటుంది.ఆ అవ్వకు ఎల్పీజీ సిలిండర్,గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్ అందిస్తాం’అని తెలిపింది.చూసారా మంచి చేస్తే నాకేమస్తుందనుకుంటున్న రోజుల్లో ఈమె మంచిపని ఎవరేస్ట్ శిఖరమంతా ఎదిగింది.చేసిన మంచి ఎప్పటికి చెడిపోదు అని నిరూపించ బడింది..

మరింత సమాచారం తెలుసుకోండి: