నిన్న సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వివిధ రంగాల్లో అవకాశాలపై సమీక్షించారు. రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు కాస్త ఆందోళనకరంగానే ఉందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు, దూరదృష్టి బాగున్నాయని అన్నారు. పబ్లిక్ రుణాలు, పెట్టుబడులపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. 
 
మూడు నెలల్లోనే సీఎం పనితీరు చూపారని ప్రశంసించారు. రాష్ట్రం అభివృధ్ధి పథంలో ముందుండేలా సహాయం చేస్తామని అన్నారు. జగన్ ఢిల్లీ వచ్చిన సమయంలో నవరత్నాల గురించి వివరించి చెప్పారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే గ్రాంట్లను తగ్గకుండా చూడాలని రాజీవ్ కుమార్ కు విఙప్తి చేశారు. నీతి ఆయోగ్ బృందానికి జగన్ 44 వేలకు పైగా స్కూళ్లను దశల వారీగా అభివృధ్ధి చేస్తున్నామని చెప్పారు. 
 
నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలలో అందించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టామని సీఎం చెప్పారు. 2020 జనవరి 26 నుండి పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు 15 వేల రుపాయల చొప్పున ఇవ్వనున్నామని సీఎం తెలిపారు. నిరక్షరాస్యతను సున్నా స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. 
 
ప్రతి ఇంటికి తాగునీటిని అందించటం కొరకు వాటర్ గ్రిడ్ తెస్తున్నామని సీఎం తెలిపారు. పౌష్టికాహార లోపాన్ని పిల్లల్లో నివారించటం కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. అంగన్ వాడీల ద్వారా మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న ఆహారంలో నాణ్యత పెంచుతున్నామని సీఎం తెలిపారు. ఆరోగ్య రంగంలో కూడా విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నామని సీఎం వివరించారు. డెంగీ, మలేరియా వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నామని జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: