బోర్డర్ లో నిత్యం సైనికులు పహారాకాస్తుంటారు .  సైనికులకోసం రక్షణగా ఇప్పటికే ఎన్నో బులెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చింది.  అయితే, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సైతం చీల్చుకు వెళ్లే బుల్లెట్లు ఇప్పుడు తయారవుతున్నాయి.  గతంలో కాపర్ తో బుల్లెట్స్ తయారయ్యేవి.  వీటిని తట్టుకునే విధంగా జాకెట్లు అందుబాటులో ఉన్నాయి.  అయితే, ఇప్పుడు దానికంటే శక్తివంతమైన ఉక్కుతో బుల్లెట్లు తయారు చేస్తున్నారు.  వీటిని ఈ జాకెట్లు ఆపలేవు.  దీనికోసం రక్షణ శాఖ కొత్త బులెట్ ప్రూఫ్ జాకెట్స్ తయారు చేసింది.  


ఏకే 47 నుంచి సెకనుకు 700 మీట్లర్ల వేగంతో దూసుకుకొచ్చే బుల్లెట్స్ నుంచి ఈ జాకెట్ తట్టుకోగలరు.  360 డిగ్రీస్ లో బుల్లెట్స్ దూసుకొచ్చిన సరే ఈ జాకెట్ రక్షణ కల్పిస్తుంది.  దాదాపు 8 కేజీల బరువుండే ఈ జాకెట్ ధరించిన తరువాత నాలుగు కేజీలుగా మారిపోతుంది.  ఒకవేళ ఈ జాకెట్ కు మంటలు అంటుకుంటే.. జాకెట్ కు ఉన్న చిన్న స్విచ్ నొక్కితే... శరీరం నుంచి జాకెట్ విడిపోతుంది.  ఎన్నో పరీక్షల తరువాత ఈ జాకెట్ నుఆర్మీకి అందజేశారు.  దాదాపు 1.8 లక్షల జాకెట్లను మొదటి విడతగా ఆర్మీకి అందజేశారు. 


త్వరలోనే మిగతా సైనికులకు కూడా ఈ జాకెట్లను అందజేయనున్నారు.  ప్రస్తుతం బోర్డర్లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు చోటుచేసుకున్న సమయంలో ఇలాంటి రక్షణ వ్యవస్థతో కూడిన జాకెట్లు సైనికులకు లభించడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. సైనికుల ప్రాణాలు రక్షించేందుకు ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి.  ఆర్టికల్ 370 రద్దు తరువాత ఎల్ ఓ సి వద్ద పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉన్నది.  రోజుకు కనీసం 10 సార్లు కాల్పులు జరుపుతూనే ఉన్నది.  మరోవైపు ఇండియాలోకి ఉగ్రవాదులను అక్రంగా చొరబడేందుకు పాక్ సైన్యం సహకరిస్తోంది.  


వీరి ఎత్తుగడలను ఇండియా సైనికులు తిప్పికొడుతున్నారు.  ప్రపంచదేశాలు పాక్ కు చురకలు అంటిస్తున్నా బుద్ధిమార్చుకోవడం లేదు.  పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది.  ఇటీవల బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలతో ఆ దేశంలో అలజడి మొదలైంది.  సింధ్, ఆఫ్ఘన్ బోర్డర్ లో ఉన్న బలూచిస్తాన్ లు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాయి. వాటికి స్వాతంత్రం లభిస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనిపించదు.  పాక్ ఇప్పటికైనా మిగతా విషయాలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి: