ఏబీఎన్ ఛానల్ ను సాక్షాత్తూ జగనే ఆదేశాల ద్వారా అనధికారికంగా నిషేధించారని ఆ ఛానల్ కు చెందిన మీడియా చెబుతోంది. ఈమేరకు ఆంధ్రజ్యోతి పత్రికలో కథనాలు వస్తున్నాయి. మరి ఇంతకీ ఈ విషయంపై అధికార పార్టీ ఏమంటోంది.. ఓ సారి చూద్దాం.. వైసీపీ వాదన ఇదీ..


“ ఏబీఎన్ కనపడొద్దు అంటూ భారీ హెడ్డింగుతో రాసిన ఆంధ్రజ్యోతి కథనం నిండా పచ్చవిషమే కనిపిస్తుంది. మంత్రులు ఆపరేటర్లపై ఒత్తిడి తెస్తున్నారంటూ బరి తెగించి అబద్ధాలను అచ్చువేస్తోంది ఈ పచ్చి పచ్చ పత్రిక. సాధారణ ప్రజలకు తెలియని విషయాలు కనుక తామెలా రాసినా జనాలు నమ్మేస్తారనే పిచ్చి భ్రమలోనే ఇంకా ఉన్నాయి పచ్చపత్రికలు ఉన్నాయి అనిపిస్తుంది అంధ్ర జ్యోతి రాసిన ఈ కథనం చూస్తే.


ఎమ్.ఎస్.ఓలపై ఒత్తిడి తెచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులే ఎబీఎన్ ఛానెల్ ను ఆపించారన్నది ఈ పత్రిక ఆక్రోశపూరిత ఆరోపణ. అయితే నిజాలేమిటో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సిటీ కేబుల్ MSOలు టీడీపీ మద్దతుదారులే అని అందరికీ తెలిసిన విషయమే. కనుకనే ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైయస్ జగన్ పాదయాత్రకు విపరీతమైన స్పందన ప్రజలనుంచి వస్తోందని చూసి రాష్ట్రంలో చాలా చోట్ల సాక్షీ ప్రసారాలు జరగకుండా అడ్డుకున్నారు.


అయితే ఆంధ్రజ్యోతి విషయంలో జరిగింది వేరు. అధికారం చేతిలో ఉంది కదా అని ఐదేళ్లుగా సిటీ కేబుల్ వాళ్లకు 5 ఏళ్లుగా కేరియర్ ఛార్జులు కట్టకుండా నడింపించేసారు. నెలవారీ చెల్లించాల్సిన కేరియర్ ఛార్జ్ చెల్లించకపోయినా మిగతా ఛానల్స్ తో సమానంగా ప్రియారిటీలో ఉండేది ఏబీఎన్. కనీసం ప్రభుత్వం మారాకైనా బుద్ధి తెచ్చుకుని కట్టిందా అంటే ఈ మూడు నెలల్లో కూడా పైసా చెల్లించలేదట సదరు ఛానెల్.

తమ ఛానెల్ రాకపోతే వినియోగదారులే బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేయాలని రాధాక్రిష్ణ గగ్గోలు పెట్టే బదులు ఎంఎస్వోలపై తానే ఫిర్యాదు చేయకూడదా? ఊహూ...ఆ పని మాత్రం చేయదు ఈ పచ్చ మీడియా యాజమాన్యం. ఎందుకంటే ఫిర్యాదు దాకా వెళితే వీళ్లు చేసిన అరాచకం బయటపడుతుంది కనుక.”

ఇదీ అధికార పార్టీ అయిన వైసీపీ వాదన.


మరింత సమాచారం తెలుసుకోండి: