ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో బాగా హడావిడి చేస్తున్న మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది...మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అని చెప్పేయొచ్చు. ఏ విషయమైన బొత్సనే డీల్ చేస్తూ మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. సీఎం జగన్ కు ఎక్కువగా మీడియా ముందుకొచ్చే అలవాటు లేకపోవడంతో...ప్రభుత్వం తరుపున ఏ ప్రకటన చేయాలన్న బొత్సనే ఎక్కువగా మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు. ఇక రాజధాని అమరావతి విషయంలో ఆయన చేసిన కామెంట్లపై ఎలాంటి దుమారం లేచిందో అందరికీ తెలుసు.


అయితే ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉంటూ హల్చల్ చేస్తున్న..బొత్స సొంత జిల్లా విజయనగరంలోని ఓ వైసీపీ ఎమ్మెల్యేకి భయపడుతున్నట్లు జిల్లా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. జిల్లాలో తన పెత్తనమే సాగాలని చూస్తున్న బొత్సకు...ఆ ఎమ్మెల్యే మంచితనం వల్ల పెత్తనం ఎక్కడ పోతుందో అని భయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే బొత్సాని అంతగా భయపెడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు... సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర.


ఇది సమస్య అనే వచ్చే జనానికి అండగా నిలబడే రాజన్నకు జిల్లాలో మంచి పేరుంది. నియోజకవర్గంలో సమస్యలు ఉంటే అవి పరిష్కరించే వరకు విశ్రమించిన ఈ సీనియర్ నేతకు వస్తున్న ఫాలోయింగ్ తో బొత్స బాగా భయపడుతున్నారని జిల్లాలో టాక్ నడుస్తోంది. అందుకే ఆయన్ని బొత్స సైలెంట్ గా సైడ్ చేసేస్తున్నారు. సీనియర్ నాయకుడైన ఈయనకు మంత్రి పదవి రాకుండా చేయడంలో బొత్స పాత్ర చాలానే ఉందని తెలుస్తోంది.


పదవి ఇస్తే ఇంకా ఆయన డామినేషన్ పెరిగిపోతుందని రెండోసారి గెలిచిన పుష్పశ్రీవాణికి మంత్రి పదవి వచ్చేలా చేశారని జిల్లాలో వైసీపీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. పైగా గిరిజన సలహా మండలి చైర్మన్ పదవి కూడా పుష్పకే దక్కింది. మొత్తం మీద రాజన్న దొరకు ఎక్కడకక్కడా చెక్ పెట్టేస్తూ...బొత్స జిల్లాలో డామినేట్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: