నల్లమల లో యురేనియం తవ్వకాల అంశాన్ని పూర్తిగా కేంద్రం పైకి నెట్టి టీఆరెస్ సర్కార్ చేతులు దులుపుకుని ప్రయత్నాన్ని చేస్తోందా? అంటే అవుననే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు వ్యాఖ్యలు పరిశీలిస్తే స్పష్టం అవుతోంది . నల్లమల్ల లో యురేనియం తవ్వకాలపై  కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా  తాము  పోరాటం చేస్తామని బాలరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి . సేవ్ నల్లమల ఉద్యమం రోజుకింత ఉదృతరూపం దాలుస్తోంది . నల్లమల పరిరక్షణ కోసం సినీ , రాజకీయ ప్రముఖులతో పాటు , వివిధ రంగాలకు చెందినవారు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు .


ఈ తరుణం లో ఆత్మరక్షణలో కనబడినట్లు కనిపిస్తోన్న టీఆరెస్ సర్కార్, సేవ్ నల్లమల కు తమ మద్దతు ఉంటుందని బాలరాజు చేత చెప్పించే ప్రయత్నం చేసినట్లు కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .  టీఆరెస్ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకుల అనుమతి ఇచ్చిందని అంటున్నారని , కానీ  ఎక్కడ కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని చెప్పుకొచ్చిన ఆయన, కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను  రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు .  సేవ్ నల్ల మల్ల కు సపోర్ట్ గా తమ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్  చేసిన ట్విట్ గురించి ఈ సందర్బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు .


 గతం లో నల్లమల అడవుల్లో  వజ్రల నిక్షేపాలు తవ్వుకునే కాంట్రాక్టు  రాబర్ట్ వాద్రా కు ఇచ్చినప్పుడు తమ పార్టీ  నాయకులు, కేసీఆర్ ముక్తకంఠంతో ఖండించారని గుర్తు చేశారు . సీఎం కేసీఆర్ నల్లమల్ల పై స్పందించటం లేదు అనటం పూర్తి అవాస్తవమన్న ఆయన , గతం లో తమ పార్టీ మాజీ ఎంపీ  కవిత ,నాయకుడు  సాంబశివుడు నల్లమల పరిరక్షణ కోసం ఉద్యమం చేశారని గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: