యురేనియం.. అణువిద్యుత్ కోసం దీన్ని బయటకు తీస్తే.. పర్యావరణానికి ఎంత హాని ఉంటుందో ఒక్కసారి చూడండి.. యూఎస్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ నివేదిక ప్రకారం యురేనియం గాలిని, నీటిని, మట్టిని, ఆహారాన్ని తొందరగా కలుషితం చేస్తుంది. గాలిలో దుమ్ములాగా ప్రయాణించి నీటిని చేరుతుంది. తద్వారా మొక్కలు గ్రహిస్తాయి. వానలు పడినపుడు ఈ అణుధార్మికత దుమ్ము భూమిలోకి చేరుతుంది.


యురేనియం కోసం బోర్లు తవ్వే ప్రాంతాలలో తాగే నీటిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భూ ఉపరితల నీటిలో ఇది చాలా దూరం ప్రయాణిస్తుంది. యురేనియం ఆనవాళ్లు మట్టిలో కలిసి ఉంటాయి. అందువల్ల మొక్కలు, చెట్ల వేర్లలో నిక్షిప్తమౌతాయి. యురేనియం తవ్వకాల కోసం 1000 ఫీట్ల వరకు బావులు తవ్వడం వల్ల 200-300 ఫీట్ల లోతులో ఉండే నీటి వనరులు కిందికి దిగుతాయి. తద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి కొరత ఏర్పడుతుంది.


ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే నదుల, నీటి సెలయేర్ల యందు, అణుధార్మిక పదార్థాలు కలవడం వల్ల రానురాను నీటి వనరుల మొత్తం విషపదార్థాలుగా మారి జలరాశులు మొత్తం అంతరిస్తాయి. మండుతున్న యురేనియంతో కార్బన్‌ను చర్య జరపడం వలన యురేనియం మోనాక్సైడ్‌ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. అందువల్ల వాతావరణంలోని ఓజోన్‌ పొర దెబ్బతిని, భూవాతావరణం వేడెక్కి ఋతువుల్లో విపరీత పరిణామాలు సంభవిస్తాయి. మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. జీవ వైవిద్యం దెబ్బతింటుంది.


విద్యుత్ ఉత్పత్తికి ప్రమాద రహిత ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి . థర్మల్‌, జల విధ్యుత్ , సౌర విద్యుత్‌ వంటివి విస్తారంగా ఉన్నాయి. వాటిని విస్మరించి అడవులను ధ్వంసం చేసి, ఆదిమ తెగలను, చెంచులను నిర్వాసితులను చేసి, నదులను విషమయం చేసి, పరిసర ప్రాంత ప్రజల బతుకులను పణంగా పెట్టే అణువిద్యుత్తుపై దృష్టి సారించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలకు సరైన సమాధానం లభించదు.


మరింత సమాచారం తెలుసుకోండి: