కప్పలకు పెళ్లి చేయటం అనే సాంప్రదాయం పూర్వ కాలం నుండి ఉంది. వర్షాలు పడని సందర్భంలో కప్పలకు పెళ్ళి చేస్తే వర్షాలు కురుస్తాయని ప్రజలు నమ్ముతారు. మండూక పరిణయం అనే పేరుతో కప్పల పెళ్లిని పిలవటం జరుగుతుంది. కప్పలకు పెళ్లి చేయటం ద్వారా వాన దేవుడు కరుణించి వర్షం కురిపిస్తాడని ప్రజలు విశ్వసిస్తారు. భారత దేశంలోని చాలా ప్రాంతాలలో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడకపోవటంతో ప్రజలు కరువు ప్రభావంతో ఇబ్బందులు పడ్డారు. వర్షాలు కురవాలని అక్కడ రెండు కప్పలకు పెళ్లి చేశారు. కప్పలకు పెళ్లి చేసిన తరువాత మధ్యప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో ఎండిపోయిన ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అయ్యాయి. కానీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వరదలతో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 
 
భారీ వరదలతో 213 ఇళ్లు కూలిపోగా 9 వేల ఇళ్లు నీట మునిగిపోయాయి. వాతావరణ శాఖ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటన చేసింది. కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు కురిసాయని కప్పలకు విడాకులు ఇప్పిస్తే వర్షాలు తగ్గుముఖం పడతాయని అక్కడి ప్రజలు భావించారు. వరదలు తగ్గాలని ఆ రెండు కప్పలను ఒకదాని నుండి మరొకటి వేరు చేశారు. ఇంద్రపురి అనే ప్రాంతంలో రెండు కప్పలకు విడాకులు ఇప్పించారు. 
 
మధ్యప్రదేశ్ లో కప్పలకు విడాకులు ఇప్పించటం కోసం పండితులు మంత్రాలను జపించి కప్పలను వేరు చేశారు. కప్పలను వేరు చేయటం వలన వరదలు తగ్గుముఖం పట్టి వర్షాల నుండి ఉపశమనం కలిగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. మరి ఈ పెళ్లి తరువాత వర్షాలు ఆగి వరదలు తగ్గుముఖం పడతాయేమో చూడాలి.ఈ మధ్య కాలంలో కర్ణాటకలోని ఉడిపి ప్రాంతంలో కూడా కప్పలకు పెళ్లి చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: